అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market) లాభాలబాటలో పయనించింది. వరుసగా రెండో వారం లాభాలతో ముగిసింది. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 97 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ(Nifty) 14 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమయ్యాయి.
అయితే అక్కడినుంచి కోలుకుని లాభాలబాట పట్టాయి. సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ట స్థాయినుంచి 582 పాయింట్లు, నిఫ్టీ 174 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 328 పాయింట్ల లాభంతో 82,500 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 25,285 వద్ద స్థిరపడ్డాయి. ఎఫ్‌ఐఐలు ధోరణి మార్చుకుని వరుసగా మూడో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా మారడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిరది. దీంతో మెటల్(Metal), కమోడిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడి 88.69 వద్ద ముగిసింది.
మెటల్, కమోడిటీ మినహా..
మెటల్, కమోడిటీ, ఆయిల్ అండ్ గ్యాస్(Oil and Gas) సెక్టార్లు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో రియాలిటీ ఇండెక్స్ 1.72 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.63 శాతం, టెలికాం 1.13 శాతం, యుటిలిటీ 0.98 శాతం, హెల్త్‌కేర్ 0.98 శాతం, బ్యాంకెక్స్(Bankex) 0.97 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.71 శాతం, పవర్ 0.70 శాతం లాభపడ్డాయి. మెటల్ ఇండెక్స్ 0.86 శాతం, కమోడిటీ 0.28 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.13 శాతం, ఐటీ 0.08 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్(Small cap index) 0.59 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.39 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.36 శాతం లాభంతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,474 కంపెనీలు లాభపడగా 1,706 స్టాక్స్ నష్టపోయాయి. 163 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 171 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 105 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో ఉండగా.. 8 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎస్‌బీఐ 2.16 శాతం, మారుతి 1.72 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.25 శాతం, ఎన్టీపీసీ 1.07 శాతం, పవర్‌గ్రిడ్ 1.05 శాతం పెరిగాయి.
Top Losers : టాటా స్టీల్ 1.47 శాతం, టీసీఎస్ 1.10 శాతం, టెక్ మహీంద్రా 0.62 శాతం, టైటాన్‌్ 0.50 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.46 శాతం నష్టపోయాయి.