అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) రెండు రోజుల తర్వాత లాభాల బాట పట్టింది. ప్రధాన సూచీలు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.
యూఎస్ ఫెడ్ రిజర్వ్ మీటింగ్ తీర్మానాల ప్రకటనకు ముందు గ్లోబల్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినా ఫెడ్ చైర్మన్ ఏం కామెంట్స్ చేస్తారోనన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 59 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైనా.. అక్కడినుంచి కోలుకుని 413 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 25 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైనా వెంటనే 32 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో 115 పాయింట్లు లాభపడిరది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 84,767 వద్ద, నిఫ్టీ (Nifty) 35 పాయింట్ల లాభంతో 25,875 వద్ద ఉన్నాయి.
ఐటీలో అమ్మకాల ఒత్తిడి..
ఐటీ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో బీఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 0.53 శాతం నష్టంతో కదలాడుతోంది. క్యాపిటల్ గూడ్స్ 0.30 శాతం, టెలికాం 0.22 శాతం నష్టంతో ఉన్నాయి. ఎనర్జీ ఇండెక్స్ 0.67 శాతం, ఆయిల్ అండ్ గ్యాసÊ 0.64 శాతం, మెటల్ 0.51 శాతం, యుటిలిటీ 0.44 శాతం, కమోడిటీ 0.43 శాతం, పవర్ 0.42 శాతం లాభాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.14శాతం లాభంతో ఉండగా.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం నష్టంతో ఉంది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో ఉండగా.. 14 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. రిలయన్స్ (Reliance) 1.13 శాతం, ఎంఅండ్ఎం 1.05 శాతం, ఎన్టీపీసీ 0.84 శాతం, టాటా స్టీల్ 0.81 శాతం, కొటక్ బ్యాంక్ 0.79 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎటర్నల్ 1.71 శాతం, టీసీఎస్ 0.70 శాతం, టాటామోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ 0.57 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.48 శాతం, ఇన్ఫోసిస్ 0.36 శాతం నష్టాలతో ఉన్నాయి.