అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Market) ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. గురువారం ఉదయం సెన్సెక్స్ 57 పాయింట్ల లాభంతో, నిఫ్టీ (Nifty) 4 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 83,357 నుంచి 83,847 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,520 నుంచి 25,679 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి. మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 26 పాయింట్ల నష్టంతో 83,432 వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల నష్టంతో 25,545 వద్ద ఉన్నాయి. రిలయన్స్ (Reliance), ఎంఅండ్‌ఎం, టీసీఎస్ సూచీలను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.
మెటల్, పవర్ సెక్టార్లలో పతనం..
మెటల్ (Metal), పవర్, కమోడిటీ తదిరత రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బీఎస్‌ఈలో సర్వీసెస్ ఇండెక్స్ 0.39 శాతం, ఆటో 0.14 శాతం, ఐటీ 0.11 శాతం లాభాలతో ఉన్నాయి. మెటల్ ఇండెక్స్ 2.26 శాతం, యుటిలిటీ ఇండెక్స్ 2.07 శాతం, పవర్ 1.82 శాతం, కమోడిటీ 1.69 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.30 శాతం, రియాలిటీ 1.30 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 1.29 శాతం, ఇండస్ట్రియల్ 1.17 శాతం, ఇన్‌ఫ్రా 1.02 శాతం నష్టంతో సాగుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.31 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.94 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.33 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 15 కంపెనీలు లాభాలతో ఉండగా.. 15 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఆసియా పెయింట్ 4.62 శాతం, రిలయన్స్ 1.68 శాతం, ఎంఅండ్‌ఎం 1.58 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.26 శాతం, టీసీఎస్ 0.54 శాతం, ఎస్‌బీఐ 0.42 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : పవర్‌గ్రిడ్ 2.83 శాతం, ఎటర్నల్ 2.74 శాతం, బీఈఎల్ 1.67 శాతం, ఎన్టీపీసీ 1.62 శాతం, టాటా స్టీల్ 1.39 శాతం నష్టాలతో ఉన్నాయి.
