Homeబిజినెస్​Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు

Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు

ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. దీంతో దేశీయ స్టాక్​ మార్కెట్లు సైతం నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 472 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో సాగుతున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | ఆసియా మార్కెట్లు (Asian Markets) నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. మన మార్కెట్లు సైతం నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 472 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.

డాలర్‌తో రూపాయి (Rupee) మారకం విలువ క్షీణిస్తుండడం, ముడిచమురు ధరలు పెరుగుతుండడంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా బ్యాంకింగ్‌ (Banking), ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐటీ వంటి రంగాలలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. నిఫ్టీ కాంట్రాక్టుల మంత్లీ ఎక్స్‌పైరీ రోజు కూడా కావడంతో సూచీలు ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. మంగళవారం ఉదయం 153 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌.. అక్కడి నుంచి 361 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌తో సూచీలు పడిపోయాయి. ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్‌(Sensex) 689 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా అక్కడినుంచి కోలుకుని 102 పాయింట్లు లాభపడింది. అనంతరం ఇంట్రాడే (Intraday) గరిష్టాల నుంచి 202 పాయింట్లు పడిపోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 472 పాయింట్ల నష్టంతో 84,306 వద్ద, నిఫ్టీ (Nifty) 121 పాయింట్ల నష్టంతో 25,844 వద్ద ఉన్నాయి. సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ మినహా మిగిలిన అన్ని ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది. ఇండియా విక్స్‌ (VIX) మరో 5 శాతం పెరిగి 12.50కి చేరుకుంది. ఇది ఇన్వెస్టర్లలో పెరుగుతున్న భయాలను సూచిస్తోంది.

ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి..

బీఎస్‌ఈలో (BSE) రియాలిటీ ఇండెక్స్‌ 0.89 శాతం, ఐటీ(IT) ఇండెక్స్‌ 0.81 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.76 శాతం, యుటిలిటీ 0.50 శాతం, ఎఫ్‌ఎంసీజీ 049 శాతం, బ్యాంకెక్స్‌ 0.46 శాతం, పవర్‌ 0.39 శాతం నష్టంతో ఉన్నాయి. మెటల్‌ (Metal) ఇండెక్స్‌ 1.04 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ 0.55 శాతం, కమోడిటీ 0.49 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.33 శాతం లాభాలతో సాగుతున్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.17 శాతం లాభంతో ఉండగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.35 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.03 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 6 కంపెనీలు లాభాలతో ఉండగా.. 24 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టాటా స్టీల్‌ 2.18 శాతం, ఎటర్నల్‌ 0.27 శాతం, టాటా మోటార్స్‌ 024 శాతం, ఎల్‌టీ 0.19 శాతం, మారుతి 0.03 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : బజాజ్‌ ఫైనాన్స్‌ 1.53 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.50 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.43 శాతం, టైటాన్‌ 1.19 శాతం, టెక్‌ మహీంద్రా 1.18 శాతం నష్టాలతో ఉన్నాయి.