అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)పై బేర్ పట్టు బిగించింది. అన్ని రంగాలు సెల్లాఫ్‌కు గురవుతున్నాయి. స్టాక్స్ భారీగా పతనమవుతుండడంతో ఇన్వెస్టర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధవారం ఉదయం సెన్సెక్స్ 386 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 488 పాయింట్లు పెరిగి లాభాల బాట పట్టింది. అయితే ఇంట్రాడే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో 1,158 పాయింట్లు నష్టపోయింది.
నిఫ్టీ (Nifty) 91 పాయింట్ల నష్టంతో మొదలైనా కోలుకుని 136 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 358 పాయింట్లు పడిపపోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు కాస్త కోలుకున్నాయి. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 609 పాయింట్ల నష్టంతో 81,570 వద్ద, నిఫ్టీ 174 పాయింట్ల నష్టంతో 25,058 వద్ద ఉన్నాయి. రూపాయి విలువలో పతనం ఆగకపోవడం, ఎఫఐఐల అమ్మకాలు నిరంతరాయంగా కొనసాగుతుండడం, భౌగోళిక రాజకీయ, వాణిజ్య అస్థిరతల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో మార్కెట్లో పతనం కొనసాగుతోంది.
అన్ని సెక్టార్లలో సెల్లాఫ్..
అన్ని సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. బీఎసఈలో ఐటీ ఇండెక్స్ 1.76 శాతం, ఇండస్ట్రియల్ 1.46 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.44 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.26 శాతం, క్యాపిటల్ మార్కెట్ 1.24 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.23 శాతం, రియాలిటీ ఇండెక్స్ 1.20 శాతం నష్టాలతో ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.64 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.41 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.83 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎసఈ సెన్సెక్స్‌లో 8 కంపెనీలు లాభాలతో ఉండగా.. 22 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎటర్నల్ 1.61 శాతం, పవర్‌గ్రిడ్ 0.81 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.68 శాతం, సన్‌ఫార్మా 0.63 శాతం, హెచ్‌యూఎల్ 0.52 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ట్రెంట్ 2.65 శాతం, బీఈఎల్ 2.30 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.10 శాతం, ఎల్టీ 1.79 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.71 శాతం నష్టాలతో ఉన్నాయి.