అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడంతో మార్కెట్ పాజిటివ్‌గా స్పందిస్తోంది. అయితే క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు బడ్జెట్ ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ గరిష్టాల వద్ద లాభాలు స్వీకరిస్తుండడంతో మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. బుధవారం ఉదయం సెన్సెక్స్ 35 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 611 పాయింట్లు పెరిగింది.
గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి 616 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 114 పాయింట్లు పైకి ఎగబాకింది. అక్కడినుంచి 147 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 489 పాయింట్ల లాభంతో 82,347 వద్ద, నిఫ్టీ (Nifty) 147 పాయింట్ల లాభంతో 25,322 వద్ద ఉన్నాయి. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో దేశీయ ఆటో స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.
Top Gainers : బీఎసఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో ఉండగా.. 8 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. బీఈఎల్ 3.35 శాతం, పవర్‌గ్రిడ్ 2.30 శాతం, ఎన్టీపీసీ 2.17 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.08 శాతం, ఎటర్నల్ 1.85 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఆసియన్ పెయింట్ 5.10 శాతం, మారుతి 2.04 శాతం, ఇన్ఫోసిస్ 1.44 శాతం, సన్‌ఫార్మా 1.40 శాతం, హెచ్‌యూఎల్ 1.39 శాతం నష్టాలతో ఉన్నాయి.