అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Markets) లాభాలతో ప్రారంభమైనా ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా వెనిజులాల మధ్య, రష్యా ఉక్రెయిన్ల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
దీంతో ప్రధాన సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అమ్మకాల ఒత్తిడితో 348 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 362 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ (Nifty) 33 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 86 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో కోలుకుని 87 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 56 పాయింట్ల నష్టంతో 85,511 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 26,168 వద్ద ఉన్నాయి.
ఐటీలో ప్రాఫిట్ బుకింగ్..
బీఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 068 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.18 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.17 శాతం, హెల్త్‌కేర్ 0.14 శాతం నష్టంతో ఉన్నాయి. ఇన్ఫ్రా 0.87 శాతం, పీఎస్‌యూ 0.76 శాతం, కమోడిటీ ఇండెక్స్ 0.71 శాతం, మెటల్ ఇండెక్స్ 0.67 శాతం, యుటిలిటీ 0.66 శాతం, పవర్ 0.52 శాతం, ఎనర్జీ 0.51 శాతం లాభాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.09 శాతం లాభంతో, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 14 కంపెనీలు లాభాలతో ఉండగా.. 16 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 1.58 శాతం, పవర్‌గ్రిడ్ 1.08 శాతం, ఎన్టీపీసీ 0.95 శాతం, టాటా స్టీల్ 0.65 శాతం, కొటక్ బ్యాంక్ 0.69 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 1.36 శాతం, ఎయిర్టెల్ 0.89 శాతం, టీసీఎస్ 0.70 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.60 శాతం, టెక్ మహీంద్రా 0.49 శాతం నష్టాలతో ఉన్నాయి.