Homeబిజినెస్​Stock Market | స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

Stock Market | స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 40 పాయింట్లు, నిఫ్టీ 41 పాయింట్లు పెరిగాయి. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ రాణించాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Market) నూతన వారాన్ని నష్టాలతో ప్రారంభించినా.. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో తిరిగి పుంజుకున్నాయి. రోజంతా స్వల్ప ఒడిదుడుకుల మధ్య కొనసాగిన బెంచ్‌మార్క్‌ సూచీలు.. చివరికి లాభాలతో ముగిశాయి.

సోమవారం ఉదయం ఉదయం సెన్సెక్స్‌ 103 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. మొదట సెన్సెక్స్‌ 83,609 పాయింట్లకు తగ్గినా తర్వాత కోలుకుని ఇంట్రాడేలో 84,127పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. నిఫ్టీ 25,645 నుంచి 25,803 పాయింట్ల మధ్య కదలాడిరది. చివరికి సెన్సెక్స్‌(Sensex) 40 పాయింట్ల లాభంతో 83,978 వద్ద, నిఫ్టీ(Nifty) 41 పాయింట్ల లాభంతో 25,763 వద్ద స్థిరపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియాలిటీ, టెలికాం రంగాల షేర్లు రాణించాయి. కంపెనీల క్యూ2 ఎర్నింగ్స్‌, అక్టోబర్‌కు సంబంధించిన ఆటో సేల్స్‌(Auto sales) బాగుండడం మార్కెట్‌ను నిలబెట్టింది.

టెలికాం, పీఎస్‌యూ బ్యాంక్‌ స్టాక్స్‌లో జోరు..

బీఎస్‌ఈలో టెలికాం(Telecom) ఇండెక్స్‌ 2.90 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 2.26 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.01 శాతం, హెల్త్‌కేర్‌ 1.14 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ 0.98 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.96 శాతం, పీఎస్‌యూ 0.74 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.62 శాతం, బ్యాంకెక్స్‌(Bankex) 0.61 శాతం పెరిగాయి. యుటిలిటీ 0.24 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.22 శాతం, ఐటీ 0.12 శాతం నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 0.71 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.62 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.32 శాతం లాభపడ్డాయి.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,227 కంపెనీలు లాభపడగా 2,009 స్టాక్స్‌ నష్టపోయాయి. 225 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 178 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 85 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 5 కంపెనీలు లాభాలతో ఉండగా.. 25 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎంఅండ్‌ఎం 1.70 శాతం, టాటా మోటార్స్‌ 1.69 శాతం, ఎటర్నల్‌ 1.49 శాతం, ఎస్‌బీఐ 1.41 శాతం, ఎయిర్‌టెల్‌ 1.09 శాతం పెరిగాయి.

Top Losers : మారుతి 3.37 శాతం, ఐటీసీ 1.50 శాతం, టీసీఎస్‌ 1.36 శాతం, ఎల్‌టీ 1.27 శాతం, బీఈఎల్‌ 0.92 శాతం నష్టపోయాయి.