Homeబిజినెస్​Stock Market | నష్టాలతో ముగిసిన మార్కెట్లు

Stock Market | నష్టాలతో ముగిసిన మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) మంగళవారం నష్టాలతో ముగించాయి. ప్రధాన సూచీలు రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగాయి. ఉదయం 56 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌.. ఇంట్రాడేలో గరిష్టంగా 401 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో ప్రారంభమై గరిష్టంగా 129 పాయింట్లు పెరిగింది. మార్కెట్లు ప్రారంభమైన కొంతసేపటికే అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులతో ఇంట్రాడే గరిష్టాల నుంచి సెన్సెక్స్‌(Sensex) 1,199 పాయింట్లు, నిఫ్టీ 343 పాయింట్లు కోల్పోయాయి. ఉదయం కొద్దిసేపు మినహా మిగతా రోజంతా నష్టాల్లోనే సాగాయి. చివరికి సెన్సెక్స్‌ 636 పాయింట్ల నష్టంతో 80,737 వద్ద, నిఫ్టీ(Nifty) 174 పాయింట్ల నష్టంతో 24,542 వద్ద స్థిరపడ్డాయి.

అమెరికా(America) అనుసరిస్తున్న వాణిజ్య విధానంతో అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనికితోడు జియో పొలిటికల్‌ టెన్షన్స్‌ పెరుగుతుండడంతో ఫారిన్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈనెల 6న ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌లో రేట్‌ కట్‌ను ప్రకటించనుంది. వడ్డీ రేటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తారన్న అంచనాలను మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ చేసింది. ఆర్‌బీఐ(RBI) కామెంటరీ కోసం మార్కెట్‌ ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

బీఎస్‌ఈలో 1,731 కంపెనీలు లాభపడగా 2,266 స్టాక్స్‌ నష్టపోయాయి. 147 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 108 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 37 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 3.10లక్షల కోట్లు తగ్గింది.

Stock Market | అన్ని రంగాల్లోనూ సెల్లాఫ్..

రియాలిటీ(Realty) మినహా మిగతా రంగాల షేర్లు నష్టాల బాటలో పయనించాయి. బీఎస్‌ఈలో రియాలిటీ ఇండెక్స్‌ 1.24 శాతం పెరిగింది. పవర్‌ ఇండెక్స్‌(Power index) 1.50 శాతం నష్టపోయింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీ 0.98 శాతం, బ్యాంకెక్స్‌ 0.89 శాతం, ఎనర్జీ సూచీ 0.88 శాతం, ఇన్‌ఫ్రా 0.75 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 0.74 శాతం పడిపోయాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.69 శాతం, మిడ్‌ క్యాప్‌ 0.52 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.07 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో ఎంఅండ్‌ఎం మినహా మిగిలిన అన్ని స్టాక్స్‌ నెగెటివ్‌గానే ట్రేడ్‌ అయ్యాయి.

Stock Market | Top gainers..

నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఏడు స్టాక్స్‌ లాభాలతో, 43 స్టాక్స్‌ నష్టాలతో ముగిశాయి. గ్రాసిం 1.28 శాతం లాభపడగా.. శ్రీరాంఫైనాన్స్‌ (Shriram finance) ఒక శాతం, బజాజ్‌ ఆటో 0.65 శాతం, ఎంఅండ్‌ఎం 0.60 శాతం లాభాలతో ఉన్నాయి.

Stock Market | Top losers..

అదానీ పోర్ట్స్‌(Adani ports) 2.32 శాతం నష్టపోగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1.89 శాతం, కోల్‌ ఇండియా 1.85 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.74 శాతం, పవర్‌గ్రిడ్‌ 1.67 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.63 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.61 శాతం నష్టపోయాయి.

Must Read
Related News