అక్షరటుడే, వెబ్‌డెస్క్:Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) కొత్త వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ప్రధాన సూచీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. గత ట్రేడింగ్ సెషన్‌తో పోల్చితే సోమవారం ఉదయం 237 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో గరిష్టంగా 797 పాయింట్లు నష్టపోయింది. 81 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. ఇంట్రాడేలో గరిష్టంగా 224 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత సూచీలు తేరుకున్నాయి.
అయితే రోజంతా స్వల్ప ఒడిదుడులకు మధ్య కొనసాగాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 77 పాయింట్ల స్వల్ప నష్టంతో 81,373 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 24,716 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా సుంకాల(US tariffs) విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ విధించిన సుంకాలతో మన మెటల్ స్టాక్స్(Metal stocks) ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు చేయడం, కోవిడ్ భయాలతోనూ గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి కనిపించింది.
బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ (Midcap index) 0.58 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.36 శాతం లాభపడింది. లార్జ్ క్యాప్ ఇండెక్స్ స్వల్ప నష్టాలతో ముగిసింది. రియాలిటీ ఇండెక్స్ 2.38 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.36 శాతం పెరిగాయి. మెటల్, ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
బీఎస్‌ఈ(BSE)లో 2,128 కంపెనీలు లాభపడగా 1,992 స్టాక్స్ నష్టపోయాయి. 167 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 122 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 48 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 11 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో.. 17 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అదాని పోర్ట్స్(Adani ports) 2.51 శాతం లాభపడగా.. ఎంఅండ్‌ఎం 1.58 శాతం, ఎటర్నల్, పవర్‌గ్రిడ్ 1.07 శాతం, హెచ్‌యూఎల్ ఒక శాతం పెరిగాయి.
Stock Market | Top losers..
టెక్ మహీంద్రా(Tech Mahindra) 1.47 శాతం నష్టపోగా.. టాటా స్టీల్ 1.21 శాతం, టాటా మోటార్స్ 1.12 శాతం, టైటాన్ 0.8 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.60 శాతం పడిపోయాయి.