Homeబిజినెస్​Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లూ నష్టాల బాటలో పయనించాయి. గ్లోబల్​ మార్కెట్ల ప్రభావంతో దేశీయ సూచీలు డీలపడ్డాయి. సెన్సెక్స్‌ 592 పాయింట్లు, నిఫ్టీ 176 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

- Advertisement -
అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లూ నష్టాల బాటలో పయనించాయి. సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 592 పాయింట్లు, నిఫ్టీ 176 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
యూఎస్‌ ఫెడ్‌(US Fed) వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నా.. చైనాపై సుంకాలను యూఎస్‌ తగ్గించినా మార్కెట్లలో జోష్‌ కనిపించలేదు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు (Global Markets) నష్టాల బాటలో సాగాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపించింది. గురువారం ఉదయం సెన్సెక్స్‌ 247 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ (Nifty) 69 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 84,312 నుంచి 84,906 పాయింట్ల మధ్య, నిఫ్టీ 25,845 నుంచి 26,032 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్‌(Sensex) 592 పాయింట్ల నష్టంతో 84,404 వద్ద, నిఫ్టీ 176 పాయింట్ల నష్టంతో 25,877 వద్ద స్థిరపడ్డాయి.

బ్యాంక్‌, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు..

బ్యాంకింగ్‌, ఐటీ(IT), ఎఫ్‌ఎంసీజీ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బీఎస్‌ఈలో టెలికాం ఇండెక్స్‌ 2.52 శాతం పడిపోగా.. బ్యాంకెక్స్‌(Bankex) 0.72 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.59 శాతం, ఐటీ 0.55 శాతం, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ 0.48 శాతం, కమోడిటీ 0.46 శాతం, ఆటో ఇండెక్స్‌ 0.41 శాతం నష్టపోయాయి. ఇండస్ట్రీయల్‌ (Industrial)0.28 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.17 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.14 శాతం లాభపడ్డాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ముగియగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.63 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.06 శాతం నష్టపోయాయి.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,876 కంపెనీలు లాభపడగా 2,291 స్టాక్స్‌ నష్టపోయాయి. 155 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 147 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 56 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 5 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో ఉండగా.. 23 కంపెనీలు నష్టాలతో ముగిశాయి.
ఎల్‌టీ 0.91 శాతం, బీఈఎల్‌ 0.66 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.46 శాతం, మారుతి 0.29 శాతం, అదాని పోర్ట్స్‌ 0.22 శాతం పెరిగాయి.
Top Losers : ఎయిర్‌టెల్‌ 1.64 శాతం, పవర్‌గ్రిడ్‌ 1.45 శాతం, టెక్‌ మహీంద్రా 1.33 శాతం, ఇన్ఫోసిస్‌ 1.14 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.04 శాతం నష్టపోయాయి.