అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) ఒడిదుడుకులకు లోనవుతోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో లాభాల బాటలో సాగుతోంది. సెన్సెక్స్ 205 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో అస్థిరత కొనసాగుతోంది. సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగుతున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 65, నిఫ్టీ 13 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్ 84,150 నుంచి 84,628 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ (Nifty) 25,693 నుంచి 25,844 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 205 పాయింట్ల లాభంతో 84,596 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 25,830 వద్ద ఉన్నాయి.
ఆటో, మెటల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు
ఆటో, మెటల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. బీఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 0.77 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.69 శాతం, ఆటో 0.68 శాతం, బ్యాంకెక్స్ 0.56 శాతం, కమోడిటీ 0.54 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.52 శాతం లాభాలతో ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, 0.64 శాతం, సర్వీసెస్ ఇండెక్స్‌లు స్వల్ప నష్టాలతో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.42 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.32 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం లాభంతో ఉన్నాయి.
Top Gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 18 కంపెనీలు లాభాలతో ఉండగా.. 12 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. కొటక్ బ్యాంక్ 0.3.46 శాతం, ఎటర్నల్ 1.75 శాతం, మారుతి 1.58 శాతం, టాటా స్టీల్ 1.14 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.81 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers..
ఎయిర్టెల్ 1.14 శాతం, ఆసియా పెయింట్ 0.86 శాతం, టైటాన్ 0.57 శాతం, ట్రెంట్ 0.57 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.33 శాతం నష్టాలతో ఉన్నాయి.