Homeబిజినెస్​market leader | వాటా తగ్గినా.. మారుతినే మార్కెట్ లీడర్‌

market leader | వాటా తగ్గినా.. మారుతినే మార్కెట్ లీడర్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : market leader | దేశీయ (Domestic) ప్యాసింజర్‌ వెహికల్స్‌(ఎస్‌యూవీ కార్లు, వ్యాన్లు) విభాగంలో మారుతి సుజుకీ (Maruti Suzuki) లీడర్‌గా కొనసాగుతోంది. గతనెలలోనూ అత్యధిక కార్లను విక్రయించిన కంపెనీగా నిలిచింది. అయితే మార్కెట్‌ వాటా (Market share) మాత్రం క్రమంగా కోల్పోతోంది. ఈ విభాగంలో హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌ కంపెనీలను వెనక్కి నెట్టి మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra and Mahindra) కంపెనీ రెండో స్థానానికి దూసుకువచ్చింది. టాటా మోటార్స్‌ మూడో స్థానంలో, హ్యుందాయ్‌ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమోటివ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌(ఫాడా) విడుదల చేసిన డాటా ప్రకారం గత నెలలో మన దేశంలో 3,49,939 ప్యాసింజర్‌ వేహికల్స్‌ (Passenger vehicle) అమ్ముడయ్యాయి. అంతకుముందు సంవత్సరంలో ఇదే నెలలో 3,44,594 యూనిట్లు అమ్ముడవగా.. ఈసారి 1.55 శాతం వృద్ధి నమోదయ్యింది.

market leader | 40 శాతం దిగువకు మారుతి…

భారత్‌(Bharath)లో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతి సుజుకీ ఇండియా రిటైల్‌ అమ్మకాలు(Retail sales) తగ్గుతూ వస్తున్నాయి. కంపెనీ మార్కెట్‌ షేర్‌ 40 శాతం దిగువకు పడిపోయింది.
2024 ఏప్రిల్‌లో 1,39,173 యూనిట్ల(Units)ను విక్రయించడం ద్వారా మార్కెట్‌లో 40.39 శాతం వాటాను కలిగి ఉన్న మారుతి సుజుకీ.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,38,021 యూనిట్లు మాత్రమే విక్రయించడంతో మార్కెట్‌ షేర్‌ 39.44 శాతానికి తగ్గిపోయింది. ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ (Year on Year) గణాంకాలను పరిశీలించినా తగ్గుదల కనిపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 40.39 శాతం ఉన్న మార్కెట్‌ షేర్‌.. 2024-25కు వచ్చేసరికి 40.25 శాతానికి పడిపోయింది.

market leader | ఎంఅండ్‌ఎం జోరు..

మహీంద్రా అండ్‌ మహీంద్రా (M&M) కంపెనీ మాత్రం తన కార్ల అమ్మకాలలో దూసుకెళ్తోంది. గతనెలలో 48,405 కార్లను విక్రయించి మార్కెట్‌ వాటాను 13.83 శాతానికి పెంచుకుంది. అంతకుముందు సంవత్సరం ఏప్రిల్‌ (April)లో 38,696 కార్లను మాత్రమే విక్రయించింది. మార్కెట్‌ షేర్‌ 11.23 శాతంగా ఉండేది.. మొత్తం ఆర్థిక సంవత్సరానికి పరిశీలిస్తే 2023-24 లో ఎంఅండ్‌ఎం వాటా 10.79 శాతం ఉండగా.. 2024-25కు వచ్చేసరికి 12.34 శాతానికి పెరిగింది. ఎస్‌యూవీ (SUV) విభాగంలో గణనీయమైన పురోగతిని సాధించింది.

market leader | టాటా మోటార్స్‌..

టాటా మోటార్స్‌ (Tata motors) గతనెలలో 44,065 కార్లను అమ్మి మూడో స్థానంలో నిలిచింది. ఇది మొత్తం ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలలో 12.59 శాతం. అంతకుముందు ఏప్రిల్‌లో 46,915 కార్లను విక్రయించడం ద్వారా 13.61 శాతం వాటాతో మూడో స్థానం (Third place)లోనే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలలో టాటా మోటార్స్‌ మార్కెట్‌ షేర్‌ 13.62 శాతం ఉండగా.. 2024-25 లో 12.9 శాతంగా ఉంది.

market leader | నాలుగో స్థానానికి హ్యుందాయ్‌..

2024 ఏప్రిల్‌లో 49,243 కార్లను విక్రయించడం ద్వారా 14.29 శాతంతో రెండో అతిపెద్ద (Second largest) కంపెనీగా నిలిచిన హ్యుందాయ్‌.. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి తన వాటాను కోల్పోయి నాలుగో స్థానానికి (Fourth place) పడిపోయింది. గతనెలలో 43,642 యూనిట్లను మాత్రమే విక్రయించడంతో మార్కెట్‌ షేర్‌ 12.47 శాతానికి పడిపోయింది. పూర్తి ఆర్థిక సంవత్సరం అమ్మకాలను పరిశీలించినా హ్యుందాయ్‌ (Hyundai) అమ్మకాలు తగ్గాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 14.21 శాతం ఉన్న మార్కెట్‌ షేర్‌.. 2024-25లో 13.46 శాతానికి పడిపోయింది.