అక్షరటుడే, కమ్మర్పల్లి: Kammarpally | కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలెం నర్సయ్య (Market Committee Chairman Palem Narsayya) అనారోగ్యానికి గురై కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) శనివారం కమ్మర్పల్లికి వెళ్లారు.
చికిత్స చేయించుకుని కోలుకుంటున్న పాలెపు నర్సయ్యను పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంకెట రవి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.