More
    HomeతెలంగాణHyderabad | రూ.5 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

    Hyderabad | రూ.5 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ఈగల్​ టీమ్​ పోలీసులు(Eagle Team Police) సోమవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) బాటసింగరం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో రూ.5 కోట్లు విలువైన 935 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పలువురు నిందితులను అరెస్ట్​ చేశారు.

    Hyderabad | పండ్ల ట్రేలలో రవాణా..

    గంజాయిని ఒడిశా నుండి మహారాష్ట్ర(Maharashtra)కు తరలిస్తుండగా గంజాయి ఈగల్ టీమ్ పట్టుకుంది. వీరు ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని ప్యాకెట్లలో నింపి పండ్ల ట్రేలలలో ఉంచి డీసీఎంలో తరలిస్తున్నారు. అయితే ఈగల్​ టీం సభ్యులు వీరి ఆట కట్టించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు. గంజాయి రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న పవార్ కుమార్​తో పాటు సమాధాన్ బిస్, వినాయక్ పవార్​ను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరికి గంజాయి సరఫరా చేసిన విక్కీ సేథ్, సచిన్ గంగారాం చౌహాన్ పరారిలో ఉన్నట్లు వెల్లడించారు.

    Hyderabad | ఈగల్​ టీమ్​ దూకుడు

    హైదరాబాద్(Hyderabad)​ నగరంలో కొన్నేళ్లుగా గంజాయి, డ్రగ్స్​ వినియోగం విపరీతంగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అలాగే నగరం మీదుగా మహారాష్ట్ర, బెంగళూరు వంటి ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు ఈగల్​ టీమ్​ ఏర్పాటు చేసంది. ఈ ఈగల్​ టీమ్​ సభ్యులు దూకుడు పెంచారు. డ్రగ్స్​, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు.

    ఈగల్​ టీమ్​ గంజాయి, డ్రగ్స్ దందాలపై మెరుపు దాడులు చేస్తోంది. తాజాగా రూ.5 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకొంది. ఇటీవల మల్నాడు రెస్టారెంట్​ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్​ రాకెట్​ను ఛేదించింది. అలాగే పలువురు గంజాయి విక్రేతలను సైతం అరెస్ట్​చేసింది. డెకాయి ఆపరేషన్​ నిర్వహించి గంజాయికి బానిసైన వారిని అదుపులోకి తీసుకొని డి అడిక్షన్​ సెంటర్​కు తరలించింది.

    More like this

    Weather Updates | తెలంగాణలో నేడు భారీ వర్షాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | తెలంగాణలో సోమవారం భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ...

    Medha School drug case | బోయిన్‌పల్లి మేధా స్కూల్‌ డ్రగ్స్ తయారీ కేసు.. నిందితుల రిమాండ్​.. విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆందోళన

    అక్షరటుడే, హైదరాబాద్: Medha School drug case | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న...

    Pakistan vs India | భారత్ vs పాక్ మ్యాచ్‌లో హైడ్రామా.. DRS నిర్ణయాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న అంపైర్స్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pakistan vs India| ఎన్నో విమ‌ర్శ‌ల న‌డుమ జ‌రిగిన భార‌త్ వ‌ర్సెస్ పాక్ Ind vs...