అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Excise Department | నగరంలో గంజాయిని (Marijuana) విక్రయిస్తున్న ఒకరిని అరెస్ట్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ సీఐ స్వప్న (Excise CI Swapna) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అసద్‌బాబా నగర్లో (Asad Baba Nagar) నివాసముంటున్న షేక్ అక్రం, షేక్ ఇర్ఫాన్ తమ నివాసాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లుగా పక్కా సమాచారంతో దాడులు చేశారు.
ఈ దాడిలో షేక్ అక్రం నుంచి సుమారు 4 కిలోల వరకు గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు షేక్ ఇర్ఫాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కేసు నమోదు చేసిన అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు ఆమె తెలిపారు. పరారీలో ఉన్న షేక్ ఇర్ఫాన్‌ను కూడా త్వరలో పట్టుకుంటామని సీఐ స్వప్న తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై మల్లేష్, సిబ్బంది సునీల్, షబ్బీర్, ధర్‌సింగ్, సంజయ్, సుచరిత పాల్గొన్నారు.