అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలో గంజాయి (Marijuana) విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. యువతను టార్గెట్ చేస్తూ విక్రయాలు జరుపుతున్నారు.
గంజాయి సరఫరాను నిలువరించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదోఒక విధంగా నగరంలో మత్తుపదార్థాల విక్రయాలు కొనసాగుతున్నాయి. పక్కనే ఉన్న మహారాష్ట్ర (Maharashtra) నుంచి దిగుమతి చేసుకొని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసుకుని వయసుతో సంబంధం లేకుండా యువతకు గంజాయిని అలవాటు చేస్తున్నారు.
Nizamabad City | నగరంలో యథేచ్ఛగా..
నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో (Old Collectorate Ground) మంగళవారం రాత్రి ఓ వ్యక్తి మైదానంలోకి గంజాయిని విక్రయించేందుకు వచ్చాడు. సమాచారం అందుకున్న ఒకటో టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు.
పోలీసులు వస్తున్నారనే సమాచారంతో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అక్కడ నిలిపి ఉంచిన బైకులోని సుమారు 20 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బైక్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా గంజాయి సరఫరా చేస్తున్న వారిపై సీపీ కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.