Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | బోధన్​లో గంజాయి పట్టివేత: ఒకరి అరెస్ట్​

Bodhan | బోధన్​లో గంజాయి పట్టివేత: ఒకరి అరెస్ట్​

- Advertisement -

అక్షరటుడే, అక్షరటుడే: Bodhan | పట్టణంలో ఓ యువకుడి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీఐ వెంకట్​ నారాయణ (CI Venkat Narayana) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఎఫ్​ఆర్​సీ దాబా (FRC Dhaba) వద్ద గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఆ ప్రాంతంలో కార్తీక్​​ అనే యువకుడి వద్ద పోలీసులు 19 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కార్తీక్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Bodhan | రెంజల్​బేస్​ కేంద్రంగా…

పట్టణంలోని గతంలోనూ గంజాయి ఆనవాళ్లు కనిపించాయి. కేవలం 9కి.మీ దూరంలోనే మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దు ఉండడం.. చెక్​పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా కొరవడడంతో నిషేధిత మత్తు పదార్థాలు యథేచ్ఛగా రాష్ట్ర సరిహద్దు దాటుతున్నాయి. గతంలో పట్టణంలోని రెంజల్​బేస్​లో (Renjal Base) ఓ వ్యక్తినుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఓ యువకుడు గంజాయితో పోలీసులకు పట్టుబడడం చర్చనీయాంశమైంది.