అక్షరటుడే, బోధన్ : Bodhan Police | గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas) తన కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు.
Bodhan Police | పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తుండగా..
పట్టణ శివారులోని రవి గార్డెన్ (Ravi Garden) వద్ద సోమవారం వాహనాల తనిఖీ సందర్భంగా స్కూటీపై అనుమానాస్పదంగా వస్తున్న మహ్మద్ అఫ్రోస్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించిన అనంతరం స్కూటీ చెక్ చేయగా.. అతడి వద్ద నుంచి 1,265 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
Bodhan Police | నాందేడ్ నుంచి బోధన్‌కు..
నిందితుడు నాందేడ్ (Nanded) నుంచి బోధన్‌కు గంజాయిని తీసుకువచ్చి పట్టణంలో విక్రయిస్తున్నాడని ఏసీపీ వెల్లడించారు. గంజాయి వినియోగిస్తున్న వారితో పాటు, అఫ్రోస్కు గంజాయి సరఫరా చేసిన వారిపైనా కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, గంజాయి రవాణాకు ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో టౌన్ సీఐ వెంకటనారాయణ (CI Venkatanarayana), ఎస్సై భాస్కరాచారి (SI Bhaskarachari) తదితరులు పాల్గొన్నారు.