అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maoists Letter : సమ సమాజ స్థాపనే లక్ష్యంగా సగర్వంగా ఎగిరిన ఎర్రజెండా ఇప్పుడు దారం తెగిన పతంగిలా మారింది. ఒకనాడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన నక్సలిజం(Naxalism) నేడు తుడిచి పెట్టుకుపోయే దుస్థికి చేరినట్లే కనిపిస్తోంది.
నక్సలిజాన్ని Naxalism అంతమొందిస్తామన్న కేంద్రం ఆ దిశగా చేపట్టిన ఆపరేషన్ కగార్(Operation Kagar) అంతిమ దశకు చేరుకుంది. రాజ్యం నిర్బంధం, బలగాల దిగ్బంధంతో మావోయిస్టులకు ఊపిరి ఆడటం లేదు.
వరుస ఎన్కౌంటర్లలో వందలాది మంది నేలకొరుగుతున్నారు. మరికొందరు జనజీవన స్రవంతిలో కలిసి పోతున్నారు. కేడర్ కనుమరుగై పోతున్న తరుణంలో, పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిన తరుణంలో మావోయిస్టు నాయకత్వం (Maoist leadership) పునరాలోచనలో పడింది.
ఈ మేరకు మావోయిస్టులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ కగార్ Operation Kagar ను తక్షణమే నిలిపివేసి, ఎన్కౌంటర్లు ఆపేస్తే.. తాము ఆయుధాలు వదిలేస్తామని ప్రకటించారు.
ఈ మేరకు లేఖ విడుదల చేశారు. ఇది మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదల అయింది. దీనిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా Union Home Minister Amit Shah కు మావోయిస్టులు రాశారు.
Maoists Letter : ఎన్కౌంటర్లు..
CPI మావోయిస్టు CPI Maoist అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడులైన ఈ లేఖ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
భారత్ గడ్డ Indian soil పై 2026 మార్చి లోపు మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా Union Home Minister Amit Shah ప్రకటించిన విషయం తెలిసిందే.
దీనికితోడు Operation Kagar పేరుతో ఇటీవల రోజుకో ఎన్కౌంటర్ అన్నట్లుగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఆపరేషన్ కగార్లో భాగంగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో మావోలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ తరుణంలో మావోయిస్టుల తాజా నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.