ePaper
More
    HomeజాతీయంMaoists | బంద్​కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

    Maoists | బంద్​కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoists | ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) ఆపాలని మావోయిస్టులు డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 20న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బంద్​కు పిలుపునిచ్చారు. బంద్​ను విజయవంతం చేయాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఆపరేషన్ కగార్​ను నిరసిస్తూ బంద్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల బంద్ ప్రకటన నేపథ్యంలో ఏవోబీ(AOB), తెలంగాణ- ఛత్తీస్​గఢ్ సరిహద్దులు (Telangana-Chhattisgarh borders), ఏజెన్సీ ఏరియాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

    Maoists | ఆపరేషన్​ కగార్​తో బలహీనం

    కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Amit Shah) పార్లమెంట్​లో ప్రకటన కూడా చేశారు. మావోల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్​ కగార్​ ప్రారంభించింది. ఆపరేషన్​లో భాగంగా వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. తమకు కంచు కోటగా ఉన్న అడవుల్లోకి సైతం బలగాలు చొచ్చుకు వస్తుండడంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు.

    ఈ ఏడాది జరిగిన ఎన్​కౌంటర్లలో భారీగా కేడర్​ను మావోయిస్ట్​ పార్టీ కోల్పోయింది. మరోవైపు కీలక నేతలు సైతం నేలకొరిగారు. ఈ క్రమంలో తాము శాంతి చర్చలకు సిద్ధమని, ఆపరేషన్​ కగార్​ ఆపాలని మావోయిస్టులు కోరుతున్నారు. అయితే కేంద్రం చర్చలకు ముందుకు రావడం లేదు. ఆయుధాలు వీడి పోలీసుల ఎదుట లొంగిపోవాలని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో మావోయిస్టులు ఆపరేషన్​ కగార్​ను నిరసిస్తూ బంద్​కు పిలుపునిచ్చారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...