అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maoists | ఆపరేషన్ కగార్(Operation Kagar)తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మావోల అంతమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బలగాలు ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని పలు కీలక అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ– ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్ట(Karregutta)ల్లో సైతం వేల సంఖ్యలో బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల్లో కొంతకాలంగా నిత్యం ఎన్కౌంటర్లు(Encounter) చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో భారీగా మావోయిస్టులు మృతి చెందారు. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు తాజాగా ఓ పోలీస్ వాహనాన్ని పేల్చివేశారు.
Maoists | ఏఎస్పీ మృతి
ఆపరేషన్ కగార్తో భారీగా కేడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులు(Maoists) తమ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకు తాము శాంతి చర్చలకు సిద్ధమని, ఆపరేషన్ కగార్ ఆపాలని కోరిన నక్సల్స్ మూడు, నాలుగు రోజులుగా దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల ఓ ట్రక్కును దగ్ధం చేసిన పోలీసులు, అనంతరం హిడ్మా స్వగ్రామంలో ఓ వ్యక్తిని ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. తాజాగా కూంబింగ్(Coombing) ఆపరేషన్ చేపడుతున్న పోలీస్ వాహనాన్ని ఐఈడీ(EID)తో పేల్చివేశారు. ఈ ఘటనలో ఏఎస్పీ ఆకాష్‌రావు(ASP Akash Rao) అక్కడికక్కడే మృతి చెందారు. డీఎస్పీ, సీఐకి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.