అక్షరటుడే, వెబ్డెస్క్ : Encounter | ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ (Bijapur) జిల్లాలోని అటవీ ప్రాంతం శుక్రవారం తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కీలక నేత, తెలంగాణకు చెందిన (Telangana Maoist) మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్(53) మృతి చెందాడు.
మావోయిస్టు అగ్రనేతలు నంబాల కేశవరావు (Nambala Keshavara0), సుధాకర్ (Sudhakar) మృతి చెందిన ఘటన మరువకముందే మరో కీలక నేత హతం అవడంతో మావోయిస్టులు కలవర పడుతున్నారు. తాజాగా శుక్రవారం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ (Bijapur National park) సమీపంలో భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ మృతి చెందాడు.
Encounter | ఆదిలాబాద్ నుంచి..
ఎన్కౌంటర్లో మృతి చెందిన భాస్కర్ స్వస్థలం ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బోథ్ (Both) మండలం పొచరా గ్రామం. యువకుడిగా ఉన్నప్పుడు ఉద్యమం పట్ల ఆకర్షితుడై అడవి బాట పట్టిన ఆయన అంచలంచెలుగా ఎదిగాడు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన తలపై రూ.25 లక్షల రివార్డు ఉంది. కాగా శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందాడు. ఘటన స్థలంలో భద్రతా బలగాలు ఏకే-47ను స్వాధీనం చేసుకున్నాయి.
Encounter | వరుస ఘటనలతో ఆందోళన
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. నిత్యం కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటుండటంతో వరుసగా మావోయిస్టులు మృతి చెందుతున్నారు. కీలక నేతల సహా క్యాడర్ను కోల్పోతుండటంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు.
Encounter | రిక్రూట్మెంట్ కరువు
మావోయిస్టు ఉద్యమం వైపు ప్రస్తుత యువత అంతగా ఆకర్షితం కావడం లేదు. దీంతో కొత్తగా రిక్రూట్మెంట్లు లేవు. మావోల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టడంతో ఎన్కౌంటర్లలో భారీగా నక్సల్స్ చనిపోతున్నారు. పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టు ఉద్యమం బలహీనం అయింది. దీంతో ఆపరేషన్ కగార్ ఆపాలని, తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు కోరుతున్నారు. కానీ, కేంద్రం మాత్రం చర్చలకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మొదట మావోలు ఆయుధాలు వీడాలని పేర్కొంటుంది.