అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoist Leader Devji Surrender | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్ర నేతలు దేవ్జీ, రాజిరెడ్డి లొంగిపోయారు. తెలంగాణ పోలీసుల ఎదుట వారు సరెండర్ అయ్యారు.
తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన తిప్పరి తిరుపతి (Tippari Tirupati) అలియాస్ దేవ్జీ మావోయిస్ట్ పార్టీ సెక్రెటరీగా ఉన్నారు. నంబాల కేశవరావు (Nambala Keshavaraao) మృతి తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే పార్టీలో కీలక నేతలు నంబాల కేశవరావు, హిడ్మా (Hidma), టెక్ శంకర్ తదితరులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. మరికొందరు ముఖ్యనాయకులు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, హిడ్మా సన్నిహితుడు బర్స దేవా సైతం సరెండర్ అయ్యారు. ఇప్పటికే బలహీనంగా మారిన పార్టీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఏకంగా పార్టీ సెక్రెటరీ దేవ్జీ లొంగిపోవడంతో పార్టీ పని అయిపోనట్లేనని తెలుస్తోంది. మరోవైపు మరో అగ్రనేత రాజిరెడ్డి సైతం సరెండర్ అయ్యారు. ఆయన మావోయిస్ట్ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.
Maoist Leader Devji Surrender | తెలంగాణ పోలీసుల ఎదుట
దేవ్జీ, రాజిరెడ్డితో సహా 16 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. SIB ముందు మావోయిస్టు అగ్రనేతలు సరెండర్ అయ్యారు. నంబాల ఎన్కౌంటర్ తర్వాత పార్టీ బాధ్యతలు స్వీకరించిన దేవ్జీ లొంగుబాటు మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. ఆపరేషన్ కగార్ (Operation Kagarతో ఇప్పటికే అగ్ర నేతలు అనేక మంది ఎన్కౌంటర్లలో చనిపోయారు. చాలా మంది ఆయుధాలు వీడి జన జీవన స్రవంతిలో కలిశారు. తాజాగా దేవ్జీ లొంగిపోవడంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అగ్రనేత సరెండర్ కావడంతో మిగతా వారు కూడా ఆయన బాటలో సాగే అవకాశం ఉంది.
దేశంలో మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే పార్టీ బలహీనంగా మారింది. తాజాగా దేవ్జీ, రాజిరెడ్డి సరెండర్ కావడంతో కేంద్ర ప్రభుత్వం విజయవంతం అయినట్లేనని భావిస్తున్నారు. కాగా దేవ్జీ, రాజిరెడ్డి లొంగిపోతారని మాజీ మావోయిస్ట్ మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) శనివారం తెలిపిన విషయం తెలిసిందే.
