అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి జిల్లాకు చెందిన మావోయిస్టు కీలక నేత ఎర్రగొల్ల శుక్రవారం రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయాడు. ఆయన పాతికేళ్లుగా సొంత ఊరు, కన్నవాళ్లను వదిలి పీపుల్స్ వార్లో చేరి అజ్ఞాతంలో ఉన్నాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం (Palvancha mandal) ఆరేపల్లి గ్రామానికి చెందిన రవి అలియాస్ సంతోష్ మావోయిస్టు పార్టీలో (Maoist party) కీలక నేతగా పనిచేస్తున్నాడు.
ఆయన 2001 సంవత్సరంలో ఇంటర్ చదువుతున్న సమయంలో నాటి పీపుల్స్ వార్ కార్యక్రమాలకు ఆకర్షితుడై ఇంటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నాటి నుంచి దాదాపు పాతికేళ్లుగా ఇంటిముఖం చూడలేదు. చివరికి కన్నతల్లి చనిపోయిన సమయంలో కూడా ఇంటికి రాలేదు. అప్పటినుంచి తండ్రి రామయ్య కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. తన కొడుకును చూసి చాన్నాళ్లయిందని ఆ తండ్రి రోధిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాష్ట్ర డీజీపీ ఎదుట రవి లొంగిపోయాడు. అతనిపై రూ. 5లక్షల రివార్డు ఉన్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.