Maoist Devji Surrenders | రాజకీయాల్లోకి వస్తా.. దేవ్​జీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Devji Surrenders | మావోయిస్ట్​ పార్టీ సెక్రెటరీ దేవ్​జీ అలియాస్ తిప్పిరి తిరుపతి (Thippiri Tirupati) మంగళవారం డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivdhar Reddy) ఎదుట లొంగిపోయారు. మీడియా ఎదుట డీజీపీ వివరాలు వెల్లడించారు. దేవ్​జీతో పాటు పొలిట్​ బ్యూరో సభ్యుడు మల్ల రాజిరెడ్డి, బడె చొక్కారావు, నూనె నర్సింహారెడ్డిపై సరెండర్​ అయ్యారు. అనంతరం దేవ్​జీ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య కారణాల రీత్యా రహస్య జీవితం నుంచి బహిరంగ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Devji Surrenders | మావోయిస్ట్​ పార్టీ సెక్రెటరీ దేవ్​జీ అలియాస్ తిప్పిరి తిరుపతి (Thippiri Tirupati) మంగళవారం డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivdhar Reddy) ఎదుట లొంగిపోయారు. మీడియా ఎదుట డీజీపీ వివరాలు వెల్లడించారు.

దేవ్​జీతో పాటు పొలిట్​ బ్యూరో సభ్యుడు మల్ల రాజిరెడ్డి, బడె చొక్కారావు, నూనె నర్సింహారెడ్డిపై సరెండర్​ అయ్యారు. అనంతరం దేవ్​జీ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య కారణాల రీత్యా రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితంలోకి వచ్చానని చెప్పారు. ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితం కోసం నేను బయటకు రాలేదని చెప్పారు. తాను రాజకీయ జీవితాన్ని కచ్చితంగా కొనసాగిస్తానన్నారు. అయితే పార్టీకి సంబంధించిన పూర్తి విషయాలు త్వరలో చెబుతానని తెలిపారు.

Maoist Devji Surrenders | ప్రజా సమస్యలపై..

ప్రజా సమస్యలపై ప్రజలతో కలిసి పని చేస్తామని రాజిరెడ్డి తెలిపారు. ప్రజా పోరాటాలను సంఘటితం చేయడానికి చట్ట పరిధిలోనే పని చేస్తామన్నారు. దేవ్​జీతో పాటు 40 మందిని ఎస్​ఐబీ పోలీసులు (SIB Police) మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. డీజీపీ శివధర్​రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చాలా మంది మావోయిస్టులు అజ్ఞాతం వీడి బయటకు వస్తున్నారని చెప్పారు. తిప్పిరి తిరుపతిపై రూ.25 లక్షల రివార్డు, రాజిరెడ్డిపై రూ.25 లక్షలు, చొక్కారావుపై రూ.20 లక్షలు, నర్సింహారెడ్డిపై రూ.20 లక్షల రివార్డు ఉందన్నారు.

తెలంగాణకు చెందిన 11 మంది కీలక మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన కోరారు. మొప్పల లక్ష్మణ్ అలియాస్ గణపతి అడవుల్లో లేరని, బయట షెల్టర్‌లో ఉన్నట్టు తెలుస్తోందన్నారు. మరో కీలక నేత సుదర్శన్‌ ఒడిశాలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

TGSRTC app ticket booking | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. యాప్​లో ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్​ చేసుకోవచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC app ticket booking | ఆర్టీసీ బస్సుల్లో యాప్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ...

HYDRAA land protection | రూ.100 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ,...

Congress Warning to Rakesh | రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..: కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

Road Safety Awareness Program | ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన ఉండాలి : సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Road Safety Awareness Program | సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీపీ సాయి చైతన్య...