HomeUncategorizedChhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | భద్రత బలగాల (Security Forces) సెర్చ్​ ఆపరేషన్​తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఛత్తీస్​గఢ్ (Chhattisgarh)​లో ఇన్​ఫార్మర్​ నెపంతో ఓ వ్యక్తిని హత్య చేశారు. మావోయిస్టు కీలక నేత హిడ్మా (Hidma) స్వగ్రామం పువ్వర్తిలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్​ కగార్ (Operation Kagar)​ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర బలగాలు నక్సల్స్​కు కంచు కోటలుగా ఉన్న అడవుల్లోకి సైతం చొచ్చుకువెళ్తున్నారు. దండకారణ్యంలో సైతం నిత్యం కూంబింగ్​ చేపడుతున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న ఎన్​కౌంటర్లలో మావోయిస్టులకు భారీగా మృతి చెందుతున్నారు.

Chhattisgarh | కీలక నేతల హతం

బీజాపూర్​ జిల్లా నేషనల్​ పార్క్​ (Bijapur National Park) అటవీ ప్రాంతంలో నాలుగు రోజులుగా బలగాలు కూంబింగ్​ చేపడుతున్నాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎన్​కౌంటర్లలో మావోయిస్ట్​ కీలక నేతలు సుధాకర్​, భాస్కర్​ మృతి చెందారు. శనివారం సైతం ఐదుగురు మావోయిస్టులు హతం అయ్యారు. బలగాల చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు తమ ఉనికి చాటుకోవడానికి యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్​ఫార్మర్​ పేరుతో ఓ గ్రామస్తుడిని హత్య చేసినట్లు సమాచారం. కాగా.. రెండు రోజుల క్రితం సైతం మావోయిస్టులు ఒ ట్రక్కును తగలబెట్టారు. ఛత్తీస్​గఢ్​లోని ఎన్​హెచ్​63పై కూలీలతో వెళ్తున్న ట్రక్కును ఆపి వారిని దింపేసిన అనంతరం దానికి నిప్పు పెట్టారు. అలాగే మరో బస్సును సైతం రెండు గంటల పాటు ఆపేసి అనంతరం వదిలేశారు.