ePaper
More
    HomeజాతీయంBihar Voter List | బీహార్ ఓట‌ర్ల జాబితాలో చిత్ర విచిత్రాలెన్నో.. అఫ్ఘాన్‌, నేపాల్ పౌరుల‌కూ...

    Bihar Voter List | బీహార్ ఓట‌ర్ల జాబితాలో చిత్ర విచిత్రాలెన్నో.. అఫ్ఘాన్‌, నేపాల్ పౌరుల‌కూ ఓటు హ‌క్కు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Voter List | బీహార్ ఓట‌ర్ల జాబితాల స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ నేప‌థ్యంలో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇటీవ‌ల పాకిస్తాన్ దేశ‌స్తుల‌కు ఓటు హ‌క్కు ఉన్న‌ట్లు గుర్తించ‌గా, తాజాగా బంగ్లాదేశ్‌, నేపాల్ పౌరుల పేర్లు ఓట‌ర్ జాబితాలో ఉన్న‌ట్లు వెలుగు చూసింది.

    ఆయా ఉదంతాలు కేంద్ర ఎన్నిక‌ల సంఘం(Election Commission) చేప‌ట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (స‌ర్‌) కు మ‌రింత మ‌ద్ద‌తు చేకూర్చుతున్నాయి. ఎన్నిక‌ల సంఘం ఓట్ల చోరీకి పాల్ప‌డుతుందంటూ ఓవైపు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ(Rahul Gnadhi) తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న త‌రుణంలో మ‌రోవైపు ఈసీ నిర్వ‌హిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మంచి ఫ‌లితాల‌ను అందిస్తోంది.

    Bihar Voter List | అక్ర‌మార్కుల‌కు ఓటు హ‌క్కు..

    బీహార్ ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(Special Intensive Revision) సందర్భంగా అనేక అవ‌క‌త‌వ‌క‌లు వెలుగులోకి వ‌చ్చాయి. విదేశీయుల‌కు ఓటు హ‌క్కు ఉన్న‌ట్లు బ‌య‌ట ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఓటర్ల గుర్తింపు పత్రాలలో తేడాలు కనిపించడంతో దాదాపు 3,00,000 ఓటర్లకు భారత ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈసీ వర్గాల సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాల పౌరుల‌తో పాటు మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వ‌చ్చిన‌ కొంతమంది పౌరులు కూడా భారతీయ ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్నట్లు తేలింది. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (Electoral Registration Officers) నిర్వహించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఇవి బయటికొచ్చాయి. ఆగస్టు 30 వ‌ర‌కు సమగ్ర ధ్రువీకరణ నిర్వహిస్తున్నామ‌ని, ఆ త‌ర్వాత అర్హత లేని పేర్లను సెప్టెంబర్ 30న ప్రచురించనున్న తుది ఓటరు జాబితా నుంచి తొలగిస్తామ‌ని ఈసీ వర్గాలు తెలిపాయి.

    Bihar Voter List | రికార్డుల ప‌రిశీల‌న‌..

    “బీహార్‌లో SIR కోసం ఇంటింటికీ వెళ్తి ధ్రువీక‌ర‌ణ‌లు ప‌రిశీలిస్తున్న సమయంలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వ‌చ్చిన వారికి పెద్ద సంఖ్యలో ఓటు హ‌క్కు ఉన్న‌ట్లు BLOలు కనుగొన్నారు. ఆయా వ్యక్తులు ఆధార్, నివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు మొదలైన అన్ని పత్రాలను పొందగలిగారని” ఈసీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. క్షేత్రస్థాయి విచారణ త‌ర్వాత వారంద‌రికీ నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలిపాయి. ఏడు రోజుల్లోపు అధికారుల ముందు హాజరు కావాలని, త‌గిన రికార్డులను స‌మ‌ర్పించాల‌ని, లేక‌పోతే ఓటర్ జాబితా నుంచి తొల‌గించ‌నున్న‌ట్లు తెలిపాయి. గురువారం నాటికి డ్రాఫ్ట్ జాబితా నుంచి పేర్లను చేర్చడం లేదా తొలగించడం కోరుతూ వ్యక్తిగత ఓటర్ల నుంచి మొత్తం 1,95,802 దరఖాస్తులు అందాయని ఈసీ ధ్రువీకరించింది. వీటిలో 24,991 దరఖాస్తులను ఇప్పటికే EROలు పరిష్కరించారు.

    Latest articles

    Reliance Jio PC | రిలయన్స్ నుంచి జియో పీసీ.. ఏజీఎంలో ఆవిష్కరణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Reliance Jio PC | అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో పీసీ...

    Roads Damage | భారీ వర్షాలతో 1,039 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Roads Damage | రాష్ట్రంలో భారీ వర్షాలతో (Heavy rains) తీవ్ర నష్టం వాటిల్లింది....

    Peddareddy | మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddareddy | వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో (Supreme Court)...

    Megastar Chiranjeevi | మ‌రోసారి మంచి మ‌న‌సు చాటుకున్న చిరంజీవి.. సైకిల్‌పై వ‌చ్చిన అభిమానిని స‌ర్‌ప్రైజ్ చేసిన మెగాస్టార్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Megastar Chiranjeevi | ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా(Karnool District), ఆదోని పట్టణానికి చెందిన...

    More like this

    Reliance Jio PC | రిలయన్స్ నుంచి జియో పీసీ.. ఏజీఎంలో ఆవిష్కరణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Reliance Jio PC | అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో పీసీ...

    Roads Damage | భారీ వర్షాలతో 1,039 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Roads Damage | రాష్ట్రంలో భారీ వర్షాలతో (Heavy rains) తీవ్ర నష్టం వాటిల్లింది....

    Peddareddy | మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddareddy | వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో (Supreme Court)...