అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Martyrs Day | శాంతి భద్రతలను పరిరక్షణ కోసం ఎంతోమంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని డీఐజీ చంద్రశేఖర్ (DIG Chandrasekhar) అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో (Police Parade Ground) పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం డీఐజీ చంద్రశేఖర్‌తో పాటు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai chaitanya) అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.
Police Martyrs Day | ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు
ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతోమంది పోలీసులు ప్రాణత్యాగం చేశారన్నారు. వారిని స్మరించుకోవడానికి అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసు అధికారులు ప్రాణత్యాగం చేశారన్నారు. గతంలో నక్సలైట్ల సమస్య ఉన్నప్పుడు ఎంతోమంది పోలీసు అధికారులు, జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వివరించారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి 24 గంటలు ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న పోలీసులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు.
Police Martyrs Day | సీఆర్పీఎఫ్ జవాన్లే..
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక భద్రత దళాలు ఏర్పడక ముందు సరిహద్దుల్లో రక్షించే బాధ్యతలను సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లు నిర్వహిస్తూ వచ్చారన్నారు. 1959 అక్టోబర్ 21న పంజాబ్‌కు (Punjab) చెందిన డీఎస్పీ కరణ్‌సింగ్ నేతృత్వంలో 21 మంది సభ్యులు కలిగిన బృందం చైనా (China) రక్షణ దళాలతో ఎదురొడ్డి పోరాడిందన్నారు. వారి త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
Police Martyrs Day | ప్రజలకు రక్షణకు..
సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ జిల్లాలో ఎంతోమంది పోలీసు అధికారులు, జవాన్లు ప్రజలను కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేశారన్నారు. శాంతి భద్రతలు, నక్సలైట్ల సమస్యలు, మతపరమైన శక్తులు, మహిళల భద్రత వంటి అనేక అంశాలలో పోలీసులు ప్రజలకు బాసటగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. పోలీసు అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మర్చిపోరావని పేర్కొన్నారు.