అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mynampally Hanumantha Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్ల ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు (Mynampally Hanumantha Rao) అన్నారు. మైనంపల్లి శనివారం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యభర్తల మాటలు విన్నారని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జీవితాలు నాశనం చేశారన్నారు.
Mynampally Hanumantha Rao | సీఎం ఎందుకు వదిలేస్తున్నారో..
కేటీఆర్, హరీశ్‌రావులను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదని మైనంపల్లి వ్యాఖ్యానించారు. కాగా.. ఇటీవల చెక్కుల పంపిణీ సమయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రావు (Malkajgiri MLA Rajasekhar Rao), మైనంపల్లి వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బీఆర్ఎస్ నాయకులు సవాల్ విసరడంతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అల్వాల్ చౌరస్తాలో ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే చెక్కుల పంపిణీ సందర్భంగా జరిగిన గొడవలో గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలను శుక్రవారం కేటీఆర్(KTR) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు సైతం వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Mynampally Hanumantha Rao | జీవితంలో సీఎం కాలేవు
కేటీఆర్ వ్యాఖ్యలపై మైనంపల్లి మండిపడ్డారు. ఆయన జీవితంలో సీఎం కాలేడన్నారు. కేటీఆర్ ప్రభుత్వ భూములు అమ్ముకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య లొల్లి పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీని (BRS Party) ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. తమ కార్యకర్తల జోలికి వస్తే కేటీఆర్, హరీశ్‌రావు(Harish Rao)పై దాడి చేస్తామన్నారు.
Mynampally Hanumantha Rao | కేటీఆర్ అరాచకాలపై బుక్ రాస్తా..
గతంలో కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని మైనంపల్లి అన్నారు. సిరిసిల్ల ప్రజలు ఆయనకు బుద్ధిచెప్పే రోజులు వస్తాయన్నారు. కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అరాచకాలపై పుస్తకం రాసి గడపగడపకూ పంచుతానని పేర్కొన్నారు.
కాగా.. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు మైనంపల్లి హనుమంత రావు బీఆర్ఎస్లో కొనసాగారు. అయితే ఎన్నికల సమయంలో తనకు, తన కుమారుడికి టికెట్ ఇవ్వడానికి బీఆర్ఎస్ నిరాకరించడంతో కాంగ్రెస్‌లో చేరారు. మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్ పోటీ చేశారు. అయితే మైనంపల్లి హనుమంతరావు ఓడిపోగా, ఆయన కుమారుడు గెలిచారు.