అక్షరటుడే, బాన్సువాడ: Sunday on cycle | సైకిల్ తొక్కడంతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని సేవా సంఘం ఫ్రెండ్స్ యూత్ (Seva Sangam Friends Youth) అధ్యక్షుడు సునీల్ రాథోడ్ అన్నారు. ఈనెల 3న అంతర్జాతీయ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నస్రుల్లాబాద్ (Nasrullabad) మండలంలోని సంగెంలో (Sangem) మేరా యువ భారత్ (Mera Yuva Bharath), సేవా సంఘ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు సునీల్ రాథోడ్ మాట్లాడుతూ.. నేటితరం యువత ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగం వైపు మొగ్గు చూపడంతో శరీరం ఫిట్‌గా ఉండట్లేదన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై మనమంతా కలిసి ఫిట్ ఇండియాను తయారు చేయాలని సూచించారు.