అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Adulterated Alcohol | రాష్ట్రంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. ఆహార పదార్థాల నుంచి మొదలు పెడితే అల్కాహాల్ వరకు దేనిని వదలడం లేదు. అన్నింటిని కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు.
హైదరాబాద్(Hyderabad) నగరంలో కల్తీ దందా జోరుగా సాగుతోంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి మొదలు పెడితే మద్యం వరకు కల్తీ చేస్తున్నారు. అధికారులు అప్పడుప్పుడు తనిఖీలు చేస్తున్న కల్తీ దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Task Force Police) కల్తీ లిక్కర్ ముఠా గుట్టు రట్టు చేశారు.
Adulterated Alcohol | నకిలీ లేబుల్స్‌తో..
కొందరు కేటుగాళ్తు కల్తీ మద్యం(Adulterated Alcohol) తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. నకిలీ మద్యానికి బ్రాండెడ్ స్టిక్కర్లు(Branded Stickers) అతికిస్తున్నారు. అసలే రాష్ట్రంలో మద్యం రేట్లు అధికంగా ఉన్నాయి. అయినా మందుబాబులు కొనుగొలు చేసి తాగుతున్నారు. అయితే బ్రాండెడ్ మద్యం ముసుగులో నకిలీ లిక్కర్(Fake Liquor) అమ్ముతుండటంతో ప్రజలు నష్టపోతున్నారు.
Adulterated Alcohol | నిందితుల అరెస్ట్
మేడ్చల్ జిల్లా(Medchal District) కుషాయిగూడలో అక్రమంగా మద్యం లేబల్స్ తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ లిక్కర్ తయారు చేసి, బ్రాండెడ్ స్టిక్కర్లు వేస్తున్నారు. ఎక్సైజ్‌శాఖకు చెందిన మద్యం అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇద్దరు నిందితులను ఎక్సైజ్‌శాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో హుజూర్‌నగర్(Huzurnagar)లో నకిలీ మద్యం దొరికింది. దానిపై విచారణ చేపట్టగా.. అక్రమ మద్యం కుషాయిగూడలో తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేశారు.
Adulterated Alcohol | గతంలోనూ
హైదరాబాద్ నగరంలో గతంలో సైతం నకిలీ మద్యం తయారు చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణపద్మ అనే స్పిరిట్ కంపెనీలో నకిలీ మద్యం తయారు చేసి, బ్రాండెడ్ బాటిళ్లలో నింపుతున్నారు. అనంతరం వాటికి లేబుళ్లు వేసి విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులు వెలుగు చూస్తుండటంతో మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. తాము భారీగా డబ్బులు పెట్టి కొనుగోలు చేసినా మందు అసలుదా.. నకిలీదా అనుకుంటున్నారు. నకిలీ మద్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.