HomeతెలంగాణEdupayala Temple | మంజీర ఉగ్రరూపం.. జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం

Edupayala Temple | మంజీర ఉగ్రరూపం.. జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం

అక్షరటుడే, మెదక్ : Edupayala Temple | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరకు భారీగా వరద(Heavy Flood) వస్తోంది. దీంతో సింగూరు ప్రాజెక్ట్​ నుంచి దిగువకు 85 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

సింగూరు నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో మెదక్​ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల(Edupayala)లో మంజీర ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల(Sharanavaratri Festival) సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది మంజీర ఉధృతంగా పారుతుండటంతో ఆలయం మూసి ఉంది. రాజగోపురంలో వనదుర్గా భవానికి పూజారులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Edupayala Temple | ప్రమాదకరంగా ప్రవాహం..

ఈ ఏడాది ఆలయం దాదాపు 40 రోజుల పాటు మూసి ఉంది. వరద ఉధృతితో గతంలో ఆలయం 27 రోజుల పాటు మూసి ఉంచారు. అనంతరం రెండు రోజులు ఆలయాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు. మళ్లీ వరదలు రావడంతో మూసి వేశారు. ప్రస్తుతం 14 రోజులుగా ఆలయం మూసి ఉంది. శరన్నవరాత్రి ఉత్సవాలు సైతం రాజగోపురంలోనే నిర్వహిస్తున్నారు. మంజీర ఉధృతికి దుర్గమ్మ ఆలయం(Durgamma Temple) సమీపంలోని ప్రసాదాల షెడ్డు కొట్టుకుపోయింది. ఆలయం పైకప్పుని తాకి ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తోంది. ఆలయానికి వచ్చే రెండు మార్గాలను అధికారులు బంద్​ చేశారు. ఆలయం వద్దకు ఎవరు రావొద్దని సూచించారు. రాజగోపురం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి నది వైపు భక్తులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Akshara Today (@aksharatoday)

Must Read
Related News