అక్షరటుడే, వెబ్డెస్క్ : Manjeera Pipeline Blast | హైదరాబాద్ (Hyderabad) నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ప్రధాన పైప్లైన్ బ్లాస్ట్ అయింది. దీంతో పలు ఇళ్లలోకి నీరు చేరింది. రెండు అపార్ట్మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి.
నగరంలోని మణికొండ (Manikonda)లో మంజీరా పైప్లైన్ పేలిపోయింది. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు రోడ్లపైకి చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ సెల్లార్లో నిండిన నీటిని మోటార్లతో బయటకు తోడుతున్నారు. రెండు గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సెల్లార్లో ఉన్న వాహనాలు నీట మునిగాయి.
Manjeera Pipeline Blast | జలమండలి చర్యలు
పైప్లైన్ బ్లాస్ట్ (Pipeline Blast) కావడంతో జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. వెంటనే నీటి సరఫరాను నిలిపివేశారు. యుద్ధ ప్రతిపాదికన మరమ్మతు పనులు చేపట్టనున్నారు. పైప్లైన్ పగిలిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీరు సరఫరా (Drinking Water Supply) నిలిపి వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. కాగా ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ వాహనాలు నీట మునిగాయని, అవి పాడు అవుతాయని పేర్కొంటున్నారు.