అక్షరటుడే, ఇందూరు: Labour Department : జిల్లా కార్మిక శాఖ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ (Nizamabad Bar Association) ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది బి మాణిక్ రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ(Vigilance and Monitoring Committee)కి ఛైర్మన్‌గా జిల్లా కలెక్టర్ (Collector) వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా జిల్లా అదనపు కలెక్టర్ ఉంటారు. సభ్యులుగా పోలీస్ కమిషనర్, జిల్లా కార్మిక శాఖ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి, జిల్లా గిరిజన శాఖ అధికారి ఉంటారు. వీరితోపాటు సామాజిక సేవా కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు.
Labour Department : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున..
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (District Legal Services Authority) తరఫున న్యాయవాది మాణిక్ రాజ్ కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. భవన నిర్మాణ కార్మిక సంఘాలతో కలిసి పలు సంక్షేమ పథకాలు కార్మికుల దరికి చేరేలా మాణిక్ రాజ్ కృషి చేశారు.
కార్మిక చట్టాలపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు మాణిక్‌రాజ్ న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా నియమితులైన మాణిక్‌రాజ్‌కు పలువురు న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు.