HomeతెలంగాణSinger Mangli | బర్త్ డే పార్టీ కేసుపై ఎట్టకేలకు స్పందించిన మంగ్లీ.. ఏమన్నారంటే..

Singer Mangli | బర్త్ డే పార్టీ కేసుపై ఎట్టకేలకు స్పందించిన మంగ్లీ.. ఏమన్నారంటే..

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Singer Mangli : జానపద గాయని(Folk singer) మంగ్లీ బర్త్​ డే పార్టీ(Mangli birthday party case) కేసుపై ఎట్టకేలకు స్పందించారు. ఎక్స్ వేదికగా మాట్లాడారు. తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఫ్రెండ్స్ పార్టీ ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చారు. పార్టీలో తన తల్లిదండ్రులు కూడా ఉన్నట్లు తెలిపారు. లిక్కర్, సౌండ్ సిస్టమ్ కు పర్మిషన్ తీసుకోవాలనే విషయం తనకు తెలియదన్నారు.

లిక్కర్(liquor)​, సౌండ్ సిస్టమ్(sound system)​ ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలనే విషయం తనకు తెలియదని, తెలిస్తే తప్పకుండా తీసుకునేదానినన్నారు. ఈ విషయం తనకు ఎవరూ గైడ్​ కూడా చేయలేదని మంగ్లీ తెలిపారు. తానొక రోల్​ మోడల్​గా ఉండాలని అనుకుంటున్నానని, అందుకే తెలిసి తాను తప్పు చేయలేదన్నారు.

పార్టీలో పాల్గొన్నవారిలో గంజాయి ganja ఆనవాళ్లు గుర్తించినట్లు చెప్పిన పోలీసులే.. వారు గతంలో ఎక్కడో తీసుకుని ఉంటారని కూడా అన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మంగ్లీ ప్రస్తావించారు. తన బర్త్​ డే పార్టీలో ఎలాంటి గంజాయి తీసుకోలేదని, ఫారెన్​ లిక్కర్​ లభించిందన్న సమాచారం కూడా పూర్తిగా అవాస్తవమని మంగ్లీ తెలిపారు. తాము లోకల్ లిక్కర్ తప్ప ఏ మత్తు పదార్థాలు వాడలేదన్నారు. తనపై ఆధారాలు లేని అభియోగాలు మోపొద్దని మీడియా(media)కు మంగ్లీ విన్నవించారు.