HomeUncategorizedRaja Raghuvanshi | సోనమ్ మాములు కి'లేడి' కాదు.. తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న సంచలన విషయాలు

Raja Raghuvanshi | సోనమ్ మాములు కి’లేడి’ కాదు.. తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న సంచలన విషయాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Raja Raghuvanshi | మేఘాలయకు Meghalaya హనీమూన్ కోసం వెళ్లి అక్కడే హత్యకు గురైన రాజా రఘువంశీ హత్య కేసు మిస్టరీ ఎట్ట‌కేల‌కు వీడింది. రాజా రఘువంశీ(Raja Raghuvanshi)తో పెళ్లి ఇష్టం లేకే.. తాను తన భర్తను హత్య చేయించినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. పక్కా ప్లాన్‌తో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసమని మేఘాలయ వెళ్లిన భార్య సోనమ్(Sonam) అక్కడే స్పాట్ ఫిక్స్ చేసింది. అంతేకాదు, భర్తను చంపుతున్నప్పడు ఆ హత్యను కళ్లారా చూసింది సోనమ్. తన భర్తను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేసిన ఈమె ఒకవేళ తాను డబ్బు ఇచ్చి, మరీ తెప్పించుకున్న రౌడీలు హత్య చేయకపోతే.. తానే హత్య చేద్దామనుకుందట. అదెలాగో కూడా పోలీసులకు చెప్పింది. లోయ ఉన్న ప్రాంతంలో సెల్ఫీ తీసుకుంటున్నట్లు నటించి.. తానే నెట్టేద్దామని అనుకుందట. భర్తను చంపేసి.. కొన్నేళ్లు వితంతువుగా ఉండాలనే ప్లాన్ వేసిందట ఈ మాయలేడి.

Raja Raghuvanshi | అదే ప‌ట్టించింది..

నలుగురు నిందితులు.. ఆకాష్ రాజ్‌పుత్ (19), విశాల్ సింగ్ చౌహాన్ (22), రాజ్ సింగ్ కుష్వాహా (21) ఆనంద్ కుర్మి తమ నేరాన్ని అంగీకరించారని ACP (ఇండోర్ క్రైమ్ బ్రాంచ్) పూనమ్‌చంద్ యాదవ్ తెలిపారు. ‘ఘటన జరిగిన రోజు విశాల్ చౌహాన్ షిల్లాంగ్‌(Vishal Chauhan Shillong)లో ఉన్నప్పుడు ధరించిన దుస్తులను మేము స్వాధీనం చేసుకున్నాం. వాళ్లు హత్య చేసినట్లు అంగీకరించారు. మేము అతని మొబైల్ కోసం వెతుకుతున్నాం’ అని ACP తెలిపారు. నిందితుడు విశాల్ చౌహాన్ హత్య చేసినట్లు అంగీకరించడమే కాకుండా, రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీ ఘటనా స్థలంలో ఉన్నారని, ‘తన భర్త చనిపోవడాన్ని చూశారని’ వెల్లడించాడని ఏసీపీ(ACP) చెప్పారు. అయితే మేఘాలయలో జరిగిన ఈ దారుణ హత్య కేసును ఛేదించడంలో హోమ్‌స్టే(Homestay)లోని సూట్‌కేస్‌లో దొరికిన ఓ మంగళసూత్రం కీలక ఆధారంగా మారింది. ఈ చిన్న క్లూ ద్వారా పోలీసులు పక్కా ప్రణాళికతో జరిగిన హత్య మిస్టరీని ఛేదించారు.

హనీమూన్(Honeymoon) కోసం మేఘాలయలోని సోహ్రాకు వెళ్లారు ఈ దంప‌తులు. మే 22న అక్కడి ఓ హోమ్‌స్టేకు చేరుకోగా, గది అందుబాటులో లేకపోవడంతో తమ సూట్‌కేస్‌(Suitcase)ను అక్కడే ఉంచి, ప్రసిద్ధి చెందిన జీవించే వేళ్ల వంతెనలున్న నాంగ్రియాట్ గ్రామానికి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఆ రాత్రి నాంగ్రియాట్‌(Nongriot)లోని మరో హోమ్‌స్టేలో బస చేసి, మే 23న ఉదయాన్నే అక్కడి నుంచి బయలుదేరారు. అనంతరం సోహ్రాకు తిరిగివచ్చి, తమ స్కూటర్‌ను తీసుకుని వీసాడాంగ్ జలపాతం వైపు వెళ్లారు. అక్కడే రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడని పోలీసులు(police) తెలిపారు. సోహ్రాలోని హోమ్‌స్టేలో సోనమ్ వదిలివెళ్లిన సూట్‌కేస్‌లోని వస్తువులే పోలీసులకు తొలి అనుమానాన్ని కలిగించాయి. “హోమ్‌స్టే గదిలోని సూట్‌కేస్‌లో సోనమ్ మంగళసూత్రం, ఒక ఉంగరం మాకు కనిపించాయి. అదే మాకు మొదటి అనుమానాన్ని కలిగించింది. కొత్తగా పెళ్లయిన మహిళ హనీమూన్‌లో తన మంగళసూత్రాన్ని Mangalsutra సూట్‌కేస్‌లో ఎందుకు వదిలేస్తుంది?” అని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డీఎన్ఆర్ మరాక్ మీడియాకి వివరించారు