ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Mangalagiri Ragging Case | మంగ‌ళ‌గ‌రి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. ఏకంగా 15 మందిపై వేటు..!

    Mangalagiri Ragging Case | మంగ‌ళ‌గ‌రి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. ఏకంగా 15 మందిపై వేటు..!

    Published on

    అక్షరటుడే, అమరావతి: Mangalagiri Ragging Case : గుంటూరు జిల్లా(Guntur district) మంగళగిరి (Mangalagiri)లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (All India Institute of Medical Sciences – AIIMS) లో ర్యాగింగ్‌ భూతం మరోసారి తలెత్తింది. ఓ జూనియర్‌ వైద్య విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా వేధించడంతో, మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    తిరుపతికి చెందిన బాధిత విద్యార్థి, గతేడాది మంగళగిరి ఎయిమ్స్‌లో మెడికల్ విద్యన‌భ్య‌సించారు. అయితే, 2023 బ్యాచ్‌కు చెందిన సీనియర్ విద్యార్థులతో మనస్పర్థలు చెలరేగినట్టు సమాచారం. తమ గురించి వైద్య విద్యార్థినుల వద్ద తప్పుడు వ్యాఖ్యలు చేశాడని అనుమానించిన సీనియర్లు, జూనియర్‌పై కక్ష పెంచుకున్నారు.

    Mangalagiri Ragging Case : డీన్ కుమారుడు కూడా..

    ఈ నేపథ్యంలో, గత నెల 23 నుంచి 25వ తేదీ వరకు, వసతి గృహంలో జూనియర్ విద్యార్థిని నిర్బంధించి, కొట్టడం, బెదిరించడం, మానసికంగా వేధించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. తీవ్ర ఒత్తిడికి గురైన బాధితుడు, మనస్థాపంతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

    అతనికి తీవ్ర రక్తస్రావం జరగడంతో, వెంటనే తోటి విద్యార్థులు స్పందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అదృష్ట‌వ‌శాత్తు ఆ విద్యార్థి (Student)ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై ఢిల్లీDELHIలోని యూజీసీUGC ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేరింది. వెంటనే స్పందించిన వారు ఎయిమ్స్ యాజమాన్యంతో మాట్లాడి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్‌ అధికారులు, విచారణ చేపట్టి ర్యాగింగ్ జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

    ఈ దర్యాప్తులో మొత్తం 15 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌లో భాగమైయినట్టు తేలింది. వీరందరినీ తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. సమాచారం ప్రకారం, ఈ జాబితాలో ఎయిమ్స్ డీన్ కుమారుడు కూడా ఉన్నాడు. అదనంగా, మరో ఐదుగురు విద్యార్థుల పాత్ర ఉన్నట్టుగా గుర్తించగా, వారిపై త్వరలో చర్యలు తీసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, సామాజిక వేదికలపై ఘనంగా స్పందిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ల్లో ర్యాగింగ్‌ను (Ragging) రూపుమాపేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బాధిత విద్యార్థికి న్యాయం జరగాలంటూ పెద్ద సంఖ్యలో అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

    More like this

    Lonely Journey | ప్రయాణం ఒంటరిదే కానీ.. ప్రయోజనాలు అనేకమాయే!

    అక్షరటుడే, హైదరాబాద్ : Lonely Journey | ఒంటరిగా ప్రయాణించడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది...

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...