అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mangalagiri : చెడు తోవలో వెళ్తున్న తన కొడుకును సక్రమ మార్గంలో వెళ్లేలా చేయాలని అనుకున్నాడు. వెంటనే 1972 నంబరకు ఫోన్ చేశాడు. తన కుమారుడు గంజాయికి అలవాటు పడినట్లు ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయాన్ని వివరించాడు.
తన కొడుకును ఎలాగైనా చక్కదిద్దాలని పోలీసులను వేడుకున్నాడు. ఈ మేరకు పోలీసులు స్పందించారు. నిఘా పెట్టి, మొత్తం ముఠాపైనే దాడి చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో చోటుచేసుకుంది.
మంగళగిరి మండలం బేతపూడి వాసి చందు, పెదవడ్లపూడికి చెందిన ఆనంద్(బొజ్జా) అడ్డదారిలో డబ్బులు సంపాదించి అందలం ఎక్కాలనుకున్నారు. ఇందుకు గంజాయిని విక్రయించాలని నిర్ణయించుకున్నారు.
ఈమేరకు విశాఖలోని ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లేవారు. అక్కడ రూ. ఐదు వేలకు కిలో గంజాయి ganja కొనుగోలు చేసేవారు. దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయించేవారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.500కు అమ్మేవారు.
Mangalagiri | సామాజిక మాధ్యమాలను వేదికగా..
ప్యాకెట్లతోపాటు గంజాయి సిగరెట్లు సైతం అమ్మేందుకు సామాజిక మాధ్యమా(Social media)లను వేదికగా మార్చుకున్నారు. దీని ద్వారా విద్యార్ధులను ఆకర్షించేవారు. అతి తక్కువ సమయంలో అధికంగా సంపాదించే మార్గమని యువతకు వల విసిరేవారు.
మంగళగిరిలోని క్రికెట్ స్టేడియం cricket stadium ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నారు. అక్కడ యువత, విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయిస్తున్నారు. ఇలా ముఠా కార్యకలాపాలను పోలీసులు మొత్తం సేకరించారు.
బొజ్జా, చందుకు తోడు బాపిస్టు పేటకు చెందిన బుల్లా రవి, ఆత్మకూరు వాసులు తేజ, చైతన్య, లక్ష్మణరావు అనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితులు సాత్విక్, నగేశ్ పారిపోయారు. నిందితుల్లోని ఒకరి తండ్రి ఫిర్యాదుతో ఈ గంజాయి ముఠా గుట్టు రట్టు అయింది.