Homeబిజినెస్​IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది. సబ్‌స్క్రిప్షన్‌ బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగియనుంది. జోయ్‌ అలుక్కాస్‌, టైటాన్‌, మలబార్‌ వంటి ప్రముఖ సంస్థలు క్లయింట్లుగా కలిగిన ఈ కంపెనీపై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది.

శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర(Shringar House Of Mangalsutra) 2009 జనవరిలో ప్రారంభమైంది. ఇది మంగళసూత్రాలను తయారు చేసే కంపెనీ. 18 క్యారెట్లు, 22 క్యారెట్ల గోల్డ్‌తో అమెరికన్‌ డైమండ్స్‌(American Diamonds), క్యూబిక్‌ జిర్కోనియా, పెర్ల్స్‌, సెమీ ప్రీషియస్‌ స్టోన్స్‌ వంటి విభిన్న రకాల కలెక్షన్స్‌ను తయారు చేస్తుంది. ఈ కంపెనీ క్లయింట్ల జాబితాలో కార్పొరేట్‌ క్లయింట్లు, హోల్‌ సేల్‌ జ్యువెల్లర్స్‌, రిటైలర్స్‌ ఉన్నారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉనికిని కలిగి ఉంది. యూకే, న్యూజిలాండ్‌, యూఏఈ, యూఎస్‌ఏ(USA), ఫిజీ వంటి దేశాల్లో కూడా మార్కెట్‌ కలిగి ఉంది. కంపెనీ దేశీయ, అంతర్జాతీయ క్లయింట్ల జాబితాలో మలబార్‌ గోల్డ్‌ లిమిటెడ్‌, టైటాన్‌(Titan) కంపెనీ లిమిటెడ్‌, జీఆర్టీ జ్యువెల్లర్స్‌, రిలయన్స్‌ రిటైల్‌ వంటి ప్రముఖ సంస్థలున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 34 కార్పొరేట్‌ క్లయింట్లు, 1,089 హోల్‌ సెలర్స్‌, 81 రిటైలర్లకు కంపెనీ సేవలు అందిస్తోంది.
ఈ కంపెనీ రూ. 400.95 కోట్లు సమీకరించేందుకోసం ఐపీవో(IPO)కు వస్తోంది. 2.43 కోట్ల తాజా షేర్ల జారీ ద్వారా ఈ నిధులను సమీకరించనున్నారు. ఈ నిధులను కంపెనీ వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాలకోసం వినియోగించనున్నారు.

ప్రైస్‌ బాండ్‌ : కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరల శ్రేణిని రూ. 155 నుంచి రూ.165 గా నిర్ణయించింది. లాట్‌ సైజ్‌(Lot size) 90 షేర్లు. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్‌ బాండ్‌ వద్ద రూ. 14,850తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కోటా, జీఎంపీ : 50 శాతం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల(QIB)కు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు, 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు గ్రేమార్కెట్‌లో రూ. 30 ప్రీమియంతో ట్రేడ్‌ అవుతున్నాయి. అంటే లిస్టింగ్‌ సమయంలో 18 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ఆర్థిక పరిస్థితి : 2025 ఆర్థిక సంవత్సరం ఫలితాలను పరిశీలిస్తే, మొత్తం ఆదాయం(Revenue) రూ. 1,430.12 కోట్లుగా ఉంది. పన్ను తర్వాత లాభం రూ. 61.11 కోట్లుగా నమోదైంది. 2024తో పోల్చితే లాభం దాదాపు రెట్టింపు అయింది. కంపెనీ రుణాలు రూ. 123.11 కోట్లుగా ఉన్నాయి. ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయన్ని వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ముఖ్యమైన తేదీలు : ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ బుధవారం ప్రారంభం అవుతుంది. శుక్రవారం వరకు అందుబాటులో ఉంటుంది. షేర్ల అలాట్‌మెంట్‌ సెప్టెంబర్‌ 15న ఉంటుంది. 17న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతుంది.