HomeUncategorizedKannappa trailer | మంచు విష్ణు క‌న్న‌ప్ప ట్రైల‌ర్ విడుద‌ల‌.. అంచ‌నాలు పెంచేసిన వీడియో

Kannappa trailer | మంచు విష్ణు క‌న్న‌ప్ప ట్రైల‌ర్ విడుద‌ల‌.. అంచ‌నాలు పెంచేసిన వీడియో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kannappa trailer | టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటించిన తన డ్రీం ప్రాజెక్ట్ సినిమా “కన్నప్ప” (Kannappa). సౌత్ నుంచి నార్త్ వరకు పాన్ ఇండియా లెవెల్లో టాప్ స్టార్స్ కలయికలో భారీ మల్టీస్టారర్​గా ఈ సినిమా వస్తోంది. మహాభారతం సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) తెరకెక్కించిన ఈ ఎపిక్ హిస్టారికల్ డ్రామా నుంచి ట్రైలర్ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. భారీ అంచనాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు. ఇందులో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ (Akshay Kumar), ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్, మధుబాల, కాజల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Kannappa trailer | ట్రైల‌ర్ అదుర్స్..

ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ (Mahabharata serial) ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అగ్ర హీరోలు ముఖ్య పాత్రలు పోషిస్తుండడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో తిన్నడు పాత్రలో విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్ (Prabhas), శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించారు. ట్రైలర్ చూస్తుంటే విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత హైప్ క్రియేట్ చేశాయి.

ఇక ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ కంటే ట్రైలర్​తోనే మరింత అంచనాలు పెంచేశారు మేకర్స్. మంచు విష్ణు (Manchu Vishnu), ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో విడుద‌ల కానుంది. చిత్రానికి స్టీఫెన్ డేవెస్సి సంగీతం Music అందిస్తున్నారు.