HomeUncategorizedKannappa Movie | కన్నప్ప ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన మంచు మనోజ్ .....

Kannappa Movie | కన్నప్ప ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన మంచు మనోజ్ .. ఆయ‌న రివ్యూ విని అంద‌రూ షాక్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Kannappa Movie | మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ ఈ రోజు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 11 ఏళ్లుగా ఈ సినిమా ప‌నులు జ‌రుగుతూ ఉన్నాయి. ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం నేడు థియేట‌ర్స్‌లోకి రాగా, మూవీకి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. అయితే సినిమా విడుదలైన మొదటి రోజే, మంచు మనోజ్(Manchu Manoj) ప్రసాద్ ఐమాక్స్‌కి వెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తన రివ్యూ ఇచ్చారు. నేను ఊహించిన దానికంటే సినిమా చాలా బాగుంది. ప్రత్యేకించి ప్రభాస్ ఎంట్రీ(Prabhas Entry) తర్వాత సినిమా పూర్తిగా నెక్స్ట్ లెవ‌ల్‌కి వెళుతుంది. చివరి 20 నిమిషాలు విజువల్‌గా బాగున్నాయి. కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ కూడా ఆక‌ట్టుకున్నాయి. ప్రభాస్ అన్న ఇంత బాగా నటిస్తారని ఏ మాత్రం ఊహించలేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మ్యాజిక‌ల్‌ టచ్ ఇచ్చింది అని అన్నారు.

మోహన్ బాబు(Mohan Babu) నటనపై కూడా మనోజ్ పొగడ్తల వర్షం కురిపించారు. ‘నాన్నగారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఈ పాత్రలో ఒదిగిపోయారు అని చెప్పారు’ మ‌నోజ్ ఇక మూవీ రిలీజ్‌కు ముందు మంచు విష్ణు పేరు ప్రస్తావించకుండా, టీమ్‌ మొత్తానికి మ‌నోజ్ శుభాకాంక్షలు తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం మా నాన్నగారు ఎంతో కష్టపడ్డారు. ఇది అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్‌ చేశారు. తనికెళ్ల భరణి గారి జీవితకల సాకారం అవుతున్నందుకు ఆనందంగా ఉంద‌ని, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభుదేవా లాంటి స్టార్ నటులు సినిమాలో భాగం కావడం నిజంగా గర్వకారణం. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.

మొత్తానికి ‘కన్నప్ప’ సినిమా(Kannappa Movie)పై మంచు మనోజ్ స్పందన ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభాస్ క్లైమాక్స్ పాత్రపై అతని ప్రశంసలు ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చాయి. ఫ‌స్టాఫ్ కొంత స్లోగా సాగుతుంద‌ని, అది కాస్త సినిమాకి మైన‌స్ అయింద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మంచు విష్ణు (Manchu Vishnu) కెరీర్ లో బెస్ట్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చాడ‌ని కూడా చెబుతున్నారు.