అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mancherial BRS Bandh Tension | మంచిర్యాల జిల్లా (Mancherial District)లో హైటెన్షన్ నెలకొంది. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి (Kyatanapalli) మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ వీడటం లేదు. ఈ క్రమంలో చెలరేగిన ఉద్రిక్తతలు చల్లారడం లేదు. క్యాతనపల్లిలో హంగ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఛైర్పర్సన్ పీఠం దక్కించుకోవడం కోసం అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లు యత్నిస్తున్నాయి. ఎవరికి మెజారిటీ లేకపోవడం, ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు రెండు సార్లు ఎన్నికను వాయిదా వేశారు. మరో సారి ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా తెలియరాలేదు. అయితే మంగళవారం మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక కోసం వచ్చిన మంత్రి వివేక్ (Minister Vivek) కారుపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశాడు. దీంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు చేశారు.
Mancherial BRS Bandh Tension | పరామర్శించనున్న హరీశ్‌రావు
బాల్క సుమన్‌ను బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. బాల్క సుమన్ అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు జైలులో ఉన్న బాల్క సుమన్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు బయలుదేరారు.
Mancherial BRS Bandh Tension | ఏకమైన బీఆర్ఎస్, బీజేపీ
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పీఠం కోసం బీఆర్ఎస్, బీజేపీ ఏకం అయ్యాయి. ఇక్కడ హంగ్ రావడంతో రెండు సార్లు ఛైర్పర్సన్ ఎన్నిక (Chairperson Election) వాయిదా పడింది. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. మొదటి రెండేళ్లు బీఆర్ఎస్, తర్వాత మూడేళ్లు బీజేపీ ఖానాపూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ పదవిని తీసుకోనున్నాయి.ఖానాపూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక ఎప్పుడనే దానిపై ఉత్కంఠ నెలకొంది.