అక్షరటుడే, వెబ్‌డెస్క్: Manasantha Nuvve re release date | తెలుగు సినీ ప్రేమికులకు ఇది శుభవార్త.. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ నటించిన క్లాసిక్ రొమాంటిక్ చిత్రం ‘మనసంతా నువ్వే’ (Manasantha Nuvve) మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై ఆకట్టుకోవడానికి రెడీ అవుతోంది. ఉదయ్ కిరణ్ సినీ ప్రస్థానంలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాను వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం ఉదయ్ కిరణ్ అభిమానులతో పాటు లవ్ స్టోరీస్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
2001లో విడుదలైన ఈ చిత్రం అప్పటి యువతరాన్ని ఆకట్టుకుంది.. ఉదయ్ కిరణ్, రీమా సేన్ జోడీగా నటించిన ఈ సినిమాకు వీఎన్. ఆదిత్య దర్శకత్వం వహించారు. బాల్య స్నేహం క్రమంగా ప్రేమగా మారే సున్నితమైన కథాంశం ప్రేక్షకుల భావోద్వేగానికి గురిచేసింది. ‘చందు’ పాత్రలో ఉదయ్ కిరణ్ సహజమైన నటన ఆయనకు ‘లవర్ బాయ్’ అనే పేరును మరింత బలోపేతం చేసింది. ఈ రీ-రిలీజ్ ద్వారా అభిమానులు ఆయన జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకోకున్నారు.
Manasantha Nuvve re release date | మ్యూజికల్ మాస్టర్ పీస్..
ఈ సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది ఆర్.పి. పట్నాయక్ స్వరాలని చెప్పుకోవచ్చు. ‘తూనీగా తూనీగా’, ‘కిన్నెరసాని నది’, ‘చెప్పమ్మా చెప్పమ్మా’ వంటి గీతాలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్‌లలో నిలిచిపోయాయి. రీరిలీజ్‌లో 4K డిజిటల్ నాణ్యతతో పాటు మెరుగైన ధ్వని వ్యవస్థలో ఈ పాటలను థియేటర్లో ఆస్వాదించడం ప్రేక్షకులకు తాజా అనుభూతిని కలిగించనుంది.
రీ-రిలీజ్‌ల ట్రెండ్..
టాలీవుడ్లో ప్రస్తుతం రీ-రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇలాంటి ఎవర్గ్రీన్ చిత్రాలు రీరిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మెరుగైన విజువల్స్‌తో ఈ సినిమా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గతంలో థియేటర్లో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు మళ్లీ అదే అనుభవాన్ని పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. రీ-రిలీజ్లో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
వాలెంటైన్స్ డే స్పెషల్‌గా..
క్లాసికల్ లవ్‌స్టోరీగా నిలిచిన ‘మనసంతా నువ్వే’ చిత్రాన్ని తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా రీ-రిలీజ్ చేయనుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కొత్త తరం ప్రేక్షకులకు ఈ ప్రేమకథను పరిచయం చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాత తరం ప్రేక్షకులకు నాటి మధురమైన జ్ఞాపకాలను తిరిగి అందించనుండంలో ఏమాత్రం సందేహం లేదు.
#manasanthanuvve pic.twitter.com/6GCrD9Rd4B
— Srimathacreations (@SrimathaCreati1) November 26, 2025