ePaper
More
    HomeసినిమాManam Movie | జ‌పాన్‌లో రీరిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న అక్కినేని ఫ్యామిలీ చిత్రం.. అక్క‌డ నాగ్ క్రేజ్...

    Manam Movie | జ‌పాన్‌లో రీరిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న అక్కినేని ఫ్యామిలీ చిత్రం.. అక్క‌డ నాగ్ క్రేజ్ మాములుగా లేదుగా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Manam Movie | ఇండియన్ సినిమాలపై జపాన్ ప్రజల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. రజనీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో కింగ్ నాగార్జున (Hero Nagarjuna) కూడా చేరిపోయారు. ఆయనకు జపాన్‌లో ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్‌లో ఉందని చెప్పొచ్చు. అందుకు తాజా ఉదాహరణగా  జపాన్​లో రీరిలీజ్ నిలుస్తోంది ‘మనం’ మూవీ (Manam Movie). తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రీరిలీజ్ ట్రెండ్ ఇప్పుడు జపాన్‌కు చేరింది. ఆగస్టు 8న నాగార్జున కుటుంబ కథా చిత్రం ‘మనం’ జపాన్‌లో రీరిలీజ్ (Japan Re Release) అవుతోంది.

    బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున నటన చూసి జపనీస్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ఇటీవల విడుదలైన ‘కుబేర’ సినిమా ఓటీటీలో హిట్ అవడంతో జపాన్‌లో టాప్ ట్రెండింగ్ చిత్రంగా నిలిచింది. దీనివల్ల ‘మనం’కు అక్కడ డిమాండ్ పెరిగింది. జపనీస్ అభిమానులు నాగార్జునను ‘నాగ్ సామ’ అని పిలుస్తున్నారు. జపాన్ సంస్కృతిలో ‘సామ’ అనేది గౌరవప్రదమైన పదం. దేవుళ్లు, రాజులు, లెజెండ్స్‌ను మాత్రమే ఇలా పిలుస్తారు. ఇది నాగార్జునకు వారు ఇచ్చిన గొప్ప గౌరవానికి నిదర్శనం. ‘మనం’ రీ రిలీజ్ సందర్భంగా నాగార్జున జపాన్ ఫ్యాన్స్‌తో (Japan Fans) ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. హైదరాబాద్​ నుంచి వీడియో కాల్ (Zoom/Google Meet) ద్వారా జపాన్ థియేటర్లలో మూవీ చూస్తున్న అభిమానులతో అతను మాట్లాడనున్నారు. ఇది ఆ ఫ్యాన్స్‌కు మర్చిపోలేని క్షణం కానుంది.

    READ ALSO  Samantha - Raj | మ‌రోసారి కెమెరా కంటికి చిక్కిన స‌మంత‌-రాజ్.. ఇక త్వ‌ర‌లోనే పెళ్లి అంటూ కామెంట్స్

    ‘కుబేర’ హిట్ తర్వాత నాగార్జున లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’లో విలన్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఆగస్టు 14న ‘కూలీ’ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై అమితాస‌స‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. జపాన్‌లో తెలుగు సినిమాలకు, నటులకు దక్కుతున్న గుర్తింపు గర్వించదగిన విషయం. ఇప్పుడు నాగార్జునకు అక్కడ ఉన్న ఆదరణ ‘మనం’ రీ రిలీజ్ రూపంలో మరింత బలపడుతోంది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియజేస్తున్న ఈ తరహా పరిణామాలు మన పరిశ్రమ అభివృద్ధికి శుభపరిణామమే అని చెప్పాలి.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షర టుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని,...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షర టుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని,...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...