Homeజిల్లాలునిజామాబాద్​Agricultural College | వ్యవసాయ కళాశాల మంజూరుపై మానాల హర్షం

Agricultural College | వ్యవసాయ కళాశాల మంజూరుపై మానాల హర్షం

జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం అభినందనీయమని జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్​ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Agricultural College | జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్​కు (Mahesh Kumar Goud) ధన్యవాదాలు తెలియజేశారు. అగ్రికల్చరల్ కాలేజ్ మంజూరుకు కృషి చేసిన మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy), రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి సైతం ధన్యవాదాలు తెలిపారు.

Agricultural College | కళాశాలతో విద్యార్థులకు ఉపయోగం..

ఈ సందర్భంగా మానాల మోహన్​ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకు వ్యవసాయ కళాశాల (agricultural college) మంజూరు చేయడంతో.. వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ఎందరో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని ఆయన వివరించారు. శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యాలు లభిస్తాయని, పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.