HomeUncategorizedBank of Maharashtra | బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో మేనేజర్‌ కొలువులు.. వేతనం ఎంతంటే?

Bank of Maharashtra | బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో మేనేజర్‌ కొలువులు.. వేతనం ఎంతంటే?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bank of Maharashtra | బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (Bank of Maharashtra) శుభవార్త తెలిపింది. మేనేజర్‌(Manager) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌(Notification) వివరాలిలా ఉన్నాయి.

భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 350.
పోస్టుల వివరాలు : డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌ (స్కేల్‌-2, 3, 4, 5, 6).
భర్తీ చేసే విభాగాలు : ఐటీ(IT), డిజిటల్‌ బ్యాంకింగ్‌, ఐటీ సెక్యూరిటీ, ఐఎస్‌ ఆడిట్‌, సీఐఎస్‌వో, ట్రెజరీ, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, లీగల్‌ (Legal) ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అకౌంట్స్‌, క్రెడిట్‌, సీఏ, ఇంటిగ్రేటెడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ అండ్‌ పబ్లిసిటీ.

అర్హతలు :
సంబంధిత విభాగంలో డిగ్రీ(Degree), బీటెక్‌/బీఈ, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణత. అలాగే సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి : 25 నుంచి 50 ఏళ్లలోపు వారు అర్హులు.
వేతన శ్రేణి : నెలకు రూ. 64,820 – రూ. 1,40,500 (స్కేల్‌- 2, 3, 4, 5, 6 పోస్ట్స్‌)

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
దరఖాస్తు గడువు : సెప్టెంబర్‌ 30.
దరఖాస్తు రుసుము :
జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌(EWS), ఓబీసీ అభ్యర్థులకు రూ. 1,180.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 118.

ఎంపిక విధానం : రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులును ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://bankofmaharashtra.in/current-openings లో సంప్రదించగలరు.