అక్షరటుడే, వెబ్‌డెస్క్: RVNL Notification | పలు పోస్టుల భర్తీకి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్(Manager), డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా పోస్టులకు అర్హులైన వారినుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 12
పోస్టుల వారీగా.. డిప్యూటీ జనరల్ మేనేజర్(ఐటీ అండ్ ఎస్ అండ్ టీ/బీడీ) -02, మేనేజర్(ఎస్ అండ్ టీ) -05, డిప్యూటీ మేనేజర్(ఎస్ అండ్ టీ) -05.
విద్యార్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (కంప్యూటర్/ఐటీ/ఎలక్ట్రానిక్స్), పీజీ(PG), డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి : డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 45 ఏళ్లు, మేనేజర్‌కు 40 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు గరిష్ట వయో పరిమితి.
వేతనం : పోస్టులవారీగా వేతనం(Salary) ఉంటుంది.
డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు నెలకు రూ. 70వేల నుంచి రూ. 2 లక్షలు, మేనేజర్‌కు రూ. 50 వేల నుంచి రూ. 1,60 వేలు, డిప్యూటీ మేనేజర్‌కు రూ. 40 వేల నుంచి రూ. 1,40 వేలు.
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ (Offline) విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును పూరించి.. డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్, ఆగస్టు క్రాంతి భవన్, భికాజీ కామా ప్లేస్, ఆర్‌కేపురం, New Delhi, పిన్ కోడ్ : 110066 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేది : ఆగస్టు 13.
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు https://rvnl.org వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.