అక్షరటుడే, వెబ్డెస్క్ : BOB Jobs | బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank Of Baroda) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 125 మేనేజర్ గ్రేడ్(Manager grade) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిని కాంటాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్(Notification) వివరాలిలా ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 125. (ఇందులో మేనేజర్ పోస్టులు – 23, సీనియర్ మేనేజర్ పోస్టులు – 85, చీఫ్ మేనేజర్(Chief manager) పోస్టులు – 17 ఉన్నాయి.)
విభాగాలు : ఫారెక్స్ అక్విజిషన్ – రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ అనలిస్ట్, ఎంఎస్‌ఎంఈ క్రెడిట్, ఇంటర్నల్ కంట్రోల్స్, బిజినెస్ ఫైనాన్స్, ఈఎస్‌జీ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిస్క్ మేనేజ్‌మెంట్, డాటా అనలిటిక్స్ తదితర విభాగాల్లో ఈ పోస్టులున్నాయి.
అర్హతలు : పోస్టును అనుసరించి డిగ్రీ/ఎంబీఏ లేదా సీఏ/సీఎంఏ/సీఎస్/సీఎఫ్‌ఏ(అనలిటిటక్స్/ఫైనాన్స్/అకౌంంటింగ్/డాటా సైన్స్). పని అనుభవం(Work experience) తప్పనిసరి.
వయోపరిమితి : ఈ ఏడాది జూలై ఒకటో తేదీనాటికి 24 నుంచి 42 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. .
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు : ఈనెల 19.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ(Interview) ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసుకోవడానికి, పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ లో సంప్రదించండి.