అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మరింతగా మెరుగుపడేలా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం ఎంఈవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
Collector Nizamabad | ఉత్తీర్ణత శాతం పెంచాలి..
ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణత మెరుగుపడేలా కష్టపడాలని కలెక్టర్ అన్నారు. మరమ్మతు పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఎంఈవోలు (MEO), ప్రధానోపాధ్యాయులకు తెలిసి ఉండాలన్నారు. ఏ పనులకు ఎన్ని నిధులు కేటాయించబడ్డాయి, పనులు చేపట్టాల్సిన ఏజెన్సీ గురించి వివరాలు సేకరించి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
Collector Nizamabad | మధ్యాహ్న భోజనం పథకంలో నిర్లక్ష్యం వద్దు..
మధ్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ సూచించారు. ఏజెన్సీల నిర్వాహకులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లోనూ విద్యార్థులకు సంబంధించి అపార్ జనరేట్ అయ్యేలా పర్యవేక్షించాలన్నారు. ఓపెన్ స్కూల్స్లో ప్రవేశాలు గణనీయంగా చేపట్టారని అదే స్ఫూర్తితో పాఠశాలల్లో కూడా అడ్మిషన్స్ జరిగేలా కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit), డీఐఈవో రవికుమార్ (DIEO Ravikumar), డీఈవో అశోక్ (DEO Ashok) తదితరులు పాల్గొన్నారు.
